350 మంది ఉగ్రవాదుల శవాలు ఎక్కడ?

350 మంది ఉగ్రవాదుల శవాలు ఎక్కడ?

ఇస్లామాబాద్‌:పాక్ భూభాగంలో భారత వైమానిక దళాలు జైషే స్థావరాలను ధ్వంసం చేశాయన్న వాదనలను పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి కొట్టిపారేశారు. భారత్ దాడిలో 350 మంది జైషే ఉగ్రవాదులు చనిపోయారన్న ప్రచారంలో కూడా ఏ మాత్రం నిజం లేదన్నారు. బీబీసీ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వూలో పలు అంశాల్ని ప్రస్తావించారు. ‘భారత్ ఏం చెప్పింది? మూడు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని . ఎక్కడున్నాయవి? 350 మంది ఉగ్రవాదులను చంపేశామని చెప్పారు. వాళ్ల శవాలు ఏవి?’ అని ప్రశ్నించారు.‘ తమది కొత్త ప్రభుత్వమని, తమ విధానం కూడా సరికొత్తగానే ఉంటుందని పేర్కొన్నారు. ‘నేను ఇలాంటి సంఘర్షణను ఎప్పుడూ కోరుకోలేదు. పాకిస్తాన్ చెబుతున్నదేంటో భారత్ శ్రద్ధగా వినడానికి ప్రయత్నించి ఉంటే, ఇలా జరగకపోయేది.సాక్ష్యాలు అందజేయండని భారత్‌ను మేం కోరాం. సహకారం అందించడానికి సిద్ధమని, కూర్చుని మాట్లాడుకుందామని చెప్పాం. అదొక్కటే సరైన మార్గం.అణ్వాయుధాలు కలిగి ఉన్న రెండు ఇరుగు పొరుగు దేశాలు యుద్ధానికి తలపడడం సరైనదేనా? అలా చేస్తే అది ఆత్మహత్యా సదృశం.‘ జైషే మహమ్మద్ పాకిస్తాన్‌ కేంద్రంగా పని చేయటం లేదు. ‘ఏ ఉగ్రవాద సంస్థనూ పాకిస్తాన్ భూభూగాన్ని ఉపయోగించుకొని, భారత్ సహా ఏ దేశంపైనా దాడులు చేయడాన్ని మేం అనుమతించం.‘ఈ దేశంలో కోర్టులున్నాయి. కోర్టులు స్వతంత్రంగా పని చేస్తాయి. మీ దగ్గర ఏవైనా సాక్ష్యాలుంటే మాకివ్వండని భారత్‌కు చెబుతూ వస్తున్నాం. మీరు సాక్ష్యాలు అందజేస్తే మేం కోర్టులో కేసు వేస్తాం.’అన్నారు.

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos