ఆర్థిక మాంద్యంపై మంత్రి వాఖ్యలు విన్నారా?

ఆర్థిక మాంద్యంపై మంత్రి వాఖ్యలు విన్నారా?

ప్రస్తుతం ప్రపంచంతో పాటు భారతదేశం కూడా ఆర్థిక మాంద్యం గుప్పిట్లో చిక్కుకుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆర్థిక మాంద్యంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈనెలలో విడుదలైన మూడు బాలీవుడ్ చిత్రాలు భారీ వసూళ్లు సాధించాయని విడుదలైన మొదటిరోజే మూడు చిత్రాలు రూ.120 కోట్లు సాధించాయని అటువంటపుడు ఆర్థిక మాంద్యం ఎక్కడుందంటూ ప్రశ్నించారు. ఆర్థిక వ్యవస్థ బాగుందని చెప్పేందుకు ఈ మూడు బాలీవుడ్ సినిమాలు పెద్ద ఎత్తున కలెక్షన్లు వసూలు చేయడమే నిదర్శనమని అభిప్రాయపడ్డారు. 2017లో నిరుద్యోగ రేటు 45 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నట్లుగా NSSO నివేదించింది. ఈ నివేదిక సరికాదని ఆయన అన్నారు. భారత్, బ్రెజిల్లో ఆర్థిక మందగమనం ప్రభావం ఎక్కువగా ఉందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) చెప్పడంపై కూడా స్పందించారు. ఐఎంఎఫ్‌ చెబుతున్న లెక్కలు అసంపూర్ణ లెక్కలు అన్నారు.’అక్టోబర్ 2న హాలీడే సందర్భంగా మూడు హిందీ సినిమాలు ఆ ఒక్కరోజులోనే రూ.120 కోట్ల వ్యాపారం చేశాయి.భారత ఆర్థిక వ్యవస్థ బాగా లేనట్లయితే ఒకే రోజులో మూడు సినిమాలు అంత వ్యాపారాన్ని ఎలా చేయగలిగాయి’ మంత్రివర్యులు ప్రశ్నించారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos