ఆరంభం కాని పనులు రద్దు

ఆరంభం కాని పనులు రద్దు

అమరావతి:ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం చేసి చేయక ముందే శర వేగంతో పరిపాలన నిర్ణయాల్ని తీసుకుంటున్నారు. . 2019 ఏప్రిల్ 1 కంటే ముందు మంజూరైనప్పటికి ఆరంభం కాని పనుల్ని రద్దు చేసినట్లు ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణం గురువారం ఉత్తర్వుల్ని జారీ చేసారు. కనీసం 25 శాతం కూడా పనులు పూర్తి కాని పథకాల విలువలను తాజాగా నిర్ణయించి, తదుపరి చెల్లింపులు చేయరాదని తేల్చి చెప్పారు. ఆయా విభాగాధిపతులు, అధికారులు తాజా నిబంధనల ప్రకారం ధ్రువీకరించిన పనులకు మాత్రమే చెల్లించాలని పే అండ్ అకౌంట్స్ కార్యాలయాన్ని కూడా అప్రమత్తం చేసారు. పేదల సంక్షేమంతో పాటు అవినీతి రహిత పాలన అందించడమే కొత్త ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నందున శాఖల కార్యదర్శులంతా నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని ఆదేశించారు. ఎఫ్ఆర్బీఎం పరిమితులను ఏమాత్రం పట్టించుకోకుండా మంజూరు చేసిన ఇంజినీరింగ్ పనులు రాష్ట్ర ఖజానాకు భారమయ్యాయని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రాధాన్యతలను పట్టించుకోకుండా చేపట్టిన కొన్ని పథకాల పనుల్ని కూడా సమీక్షించనున్నట్లు హెచ్చరించారు. ఆర్థిక వనరులు దిగజారుతున్నందున శాఖలన్నీ సదరు ఇంజినీరింగ్ పనులను నిలిపేయాలని సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos