పడిపోయిన రూ.2000 నోట్ల చలామణి

పడిపోయిన రూ.2000 నోట్ల చలామణి

ముంబై:దేశంలో రూ.2000 నోట్ల చలామణి 31.2 శాతానికి పడిపోయింది. 2016-17 మార్చిలో రూ. 2 వేల నోట్ల చలామణి 50.2 శాతం. భారతీయ రిజర్వు బ్యాంకు సమాచారం ప్రకారం ప్రస్తుతం చలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువలో రూ.500 నోట్ల చలామణి 51 శాతం. రెండేళ్ల కిందట రూ. 500 నోట్ల చలామణి 22.5 శాతం. ఇప్పుడు వాటి చలామణి భారీగా పెరగటం గమనార్హం. మొత్తం చలామణిలో ఉన్న నోట్ల విలువలో రూ.200 నోట్ల వాటా 3.8 శాతం, వంద రూపాయల నోట్ల వాటా 2017 నుంచి నిరుటికి 19.3 నుంచి 12.3 శాతానికి తగ్గింది. ప్రస్తుతం మరింత తగ్గి 9.5 శాతానికి దిగిం ది. చలామణిలో అన్నింటికంటే తక్కువ వాటా రూ.50 నోటుదే. 2017లో 2.7 శాతంగా ఉన్న రూ.50 నోట్ల చలామణి 2018లో 2 శాతానికి పడింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos