కరోనా ఎఫెక్ట్‌..వెయ్యి మంది ఖైదీల విడుదల..

కరోనా ఎఫెక్ట్‌..వెయ్యి మంది ఖైదీల విడుదల..

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా  విజృంభిస్తోంది. అందరినీ ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. అయితే జైల్లో ఖైదీలు కనీస సౌకర్యాలు లేకపోవడం.. కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టకపోవడం.. కొందరి వల్ల వైరస్ వ్యాపిస్తుండడంతో న్యూజెర్సీ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి మంగళవారం కౌంటీ జైళ్లలోని దాదాపు 1000 మంది ఖైదీలను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి జైళ్లలో సౌకర్యాలు లేవని.. రక్షణ చర్యలు లేవని.. అందుకే ఖైదీలకు వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రమాదాన్ని నివారించడానికి వెంటనే జైళ్లలోని ఖైదీలను విడుదల చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.అయితే ఖైదీల్లో తీవ్రమైన హత్యలు అత్యాచారాలు చేసిన వారిని విడుదల చేయడం లేదు. కేవలం నగరంలో ఉల్లంఘనలు మద్యం తాగి గొడవ చేసిన వారు ప్రమాదాలు చేసిన వారు చిన్న చిన్న నేరాలతో జైలుకొచ్చిన వారిని.. నాలుగో డిగ్రీ పెట్టి క్రైంలు చేసిన ఖైదీలను మంగళవారం జైలు నుంచి విడుదల చేస్తారు.ఇక జైళ్లలో సత్పప్రవర్తన కలిగిన ఖైదీలను మాత్రమే విడుదల చేయాలని న్యాయమూర్తి నిర్ణయించడంతో ఖైదీలంతా ఊపిరిపీల్చుకున్నారు. కరోనా కారణంగా తమకు విముక్తి కలిగినందుకు కరోనా వైరస్ కు ఒకింత ఖైదీలు కృతజ్ఞతలు తెలుపుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా వైరస్ వ్యాప్తితో అందరూ బెంబేలెత్తుతుంటే.. కొందరు ఖైదీలకు మాత్రం జైలు నుంచి కూడా విడుదల దక్కడం విశేషం.

తాజా సమాచారం