చిరంజీవి చిన్నల్లుడిని వేధించిన పది మంది అరెస్ట్..

చిరంజీవి చిన్నల్లుడిని వేధించిన పది మంది అరెస్ట్..

సామాజిక మాధ్యమాల్లో వేధింపులు తాళలేక మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌దేవ్‌ కొద్ది రోజుల క్రితం సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.కొంతరు ఆకతాయిలు నకిలీ ఖాతాలు తెరచి తనతో పాటు తన కుటుంబాన్ని కూడా దూషిస్తూ వేధిస్తున్నారంటూ కళ్యాణ్‌దేవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కళ్యాణ్‌దేవ్‌ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఐటీ అడ్రస్‌ల ద్వారా పక్కా ఆధారాలతో వేధింపులకు పాల్పడ్డ పది మంది నిందితులను అరెస్ట్‌ చేశారు.ఐదు రోజుల క్రితం కళ్యాణ్ దేవ్ నుండి ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణలో భాగంగా ఇన్స్టాగ్రామ్ కు లేఖ రాశారు. వారి నుండి వివరాలు అందుకున్న వెంటనే నిందితులుగా గుర్తించిన పది మందిని అరెస్ట్ చేశారు.సినిమాల విషయనికొస్తే.. ‘విజేత’ సినిమాతో హీరోగా పరిచయమైన కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం పులి వాసు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos