సూటులోన దాగిన నగ్నసత్యం

  • In Film
  • January 29, 2019
  • 136 Views
సూటులోన దాగిన నగ్నసత్యం

2.ఓ లో లేడీ రోబోట్ గా నటించి అభిమానుల మనసు దోచింది ఎమీజాక్సన్. రోబో గాళ్ గా మైమరిపించే నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తర్వాత ఎమీజాక్సన్ అలికిడి పెద్దగా కనిపించ లేదు. కన్నడలో `ది విలన్` అనే చిత్రం అక్టోబర్ లో రిలీజైంది. ఆ తర్వాత సినిమాల్లేవ్. అయితే ఎమీ ఈ గ్యాప్ తీసుకోవడానికి కారణం లేకపోలేదు. 2019లో ఎమీజాక్సన్ లండన్ ప్రియుడు జార్జి పనాయట్టుని పెళ్లాడేస్తోందని ప్రచారం సాగుతోంది. అందుకు సింబాలిక్ గా ఇటీవలే ఎమీ ఓ హింట్ కూడా ఇచ్చింది. నిశ్చితార్థానికి గడువు సమీపించిందని పెళ్లి భాజా మోగడమే తరువాయి అని క్లూ కూడా ఇచ్చింది ఈ బ్యూటీ. ఛాన్స్ కుదిరితే చాలు జార్జితో కలిసి దేశవిదేశాలకు ఎగిరెళ్లిపోతోంది. ఒంటరి దీవులకు వెళ్లి సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతోంది.  రెగ్యులర్ గా విదేశీ బీచ్ ల నుంచి ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేస్తూ వేడెక్కిస్తోంది. అప్పట్లో దక్షిణాఫ్రికాలోని ఓ ఒంటరి దీవికి వెళ్లిపోయి అక్కడ అడవుల్లో ఏనుగులతో ఫోటోలు దిగి అభిమానులకు షేర్ చేసింది. ప్రియుడితో కలిసి వైల్డ్ లైఫ్ ట్రిప్ వెళ్లినప్పటి ఫోటోలు అప్పట్లో జోరుగా వైరల్ అయిపోయాయి.లేటెస్టుగా మరో కొత్త ఫోటోషూట్ తో ఎమీజాక్సన్ హీట్ పెంచుతోంది. బికినీ ఫోటోషూట్లకు ధీటుగా ఈ అమ్మడు కార్పొరెట్ లుక్ తో దర్శనమిస్తూ వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సూటు- బూటులో ఓ సిరీస్ కంటిన్యూగా రన్ అవుతోంది. ఈ గెటప్ లోనూ ఈ రేంజు సెక్సప్పీల్ ఎమీకి తప్ప వేరొకరికి ఛాన్సే లేదని చెప్పొచ్చు. సూటులోన దాగిన నగ్నసత్యమేంటో! అంటూ యూత్ కి సందేహాలొచ్చేలా ఇదిగో ఇలా ఫోజిచ్చింది. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos