సీఎం రమేశ్‌కు షాకిచ్చిన వాట్సాప్‌..

సీఎం రమేశ్‌కు షాకిచ్చిన వాట్సాప్‌..

తెలుగుదేశం
ఎంపీ సీఎం రమేశ్‌కు ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ షాకిచ్చింది.రమేశ్‌
వాట్సాప్‌ ఖాతాను నిలిపివేస్తున్నట్లు వాట్సాప్‌ సంస్థ ప్రకటించడంతో రమేశ్‌
విస్తుపోయారు.పలువురు నుంచి రమేశ్‌ వాట్సాప్‌ ఖాతాపై ఫిర్యాదులు రావడంతో ఖాతాను
నిలిపివేసినట్లు వాట్సాప్‌ సంస్థ స్పష్టం చేసింది.తన ఖాతా పనిచేయడం లేదంటూ
వాట్సాప్‌ సంస్థకు లేఖ రాయగా పైవిధంగా బదులిచ్చినట్లు రమేశ్‌ తెలుపుతున్నారు.పైగా
సంస్థకు రాసిన లేఖలో తానొక రాజ్యసభ సభ్యుడనే విషయాన్ని కూడా
తెలియజేసామన్నారు.వాట్సాప్‌ ఖాతా నిలిపివేయడం వెనుక కేంద్ర ప్రభుత్వం హస్తం ఉందని
తన ఫోన్‌పై కేంద్ర ప్రభుత్వం నిఘా ఉంచడం వల్ల ఇదంతా జరిగిందంటూ రమేశ్‌ ఆరోపించారు.
పొరపాటున తప్పు జరిగి వుంటే ..ఇకపై అలాంటిది జరగకుండా  చూసుకుంటానని తన ఖాతాను పునరుద్ధరించాలని 
ఆయన వాట్సాప్‌ను కోరారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వివాదాస్పద రాజకీయ పోస్టులు, కామెంట్లపై కఠినంగా వ్యవహరించనున్నట్లు సోషల్ మీడియా సంస్థలు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల అకౌంట్లపై నిఘా పెట్టింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos