వెంకన్న భక్తులకు మరిన్ని వసతులు

వెంకన్న భక్తులకు మరిన్ని వసతులు

తిరుమల: శ్రీ వారి భక్తుల కోసం మరిన్ని వసతుల్ని కల్పిస్తామని తితిదే కార్యనిర్వాహక అధికారి అనిల్‌ మార్ సింఘాల్ వెల్లడించారు. శుక్రవారం ఇక్కడి అన్నమయ్య భవన్లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలోపాల్గొన్నారు. వేసవి సెలవులకు వచ్చే యాత్రికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. స్వామి వారి దర్శన వ్యవధి, ఇందు కోసం నిరీక్షిస్తున్న భక్తులకు అందుతున్న సదుపాయాల పర్యవేక్షణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ లోని శ్రీవారి ఆలయంలో వచ్చే నెల 13న స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ జరగనుందన్నారు. ఏప్రిల్ 13 నుంచి 21 వరకు ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగనన్నాయి. 18న స్వామి వారి కల్యాణోత్సవాన్ని జరుపుతామని వివరించారు. గత అనుభవాలను దృష్ట్యా కల్యాణోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తామన్నారు. తిరుపతి గోవింద రాజ స్వామివారి ఆలయంలో చోరీ అయిన స్వర్ణ కిరీటాల కోసం ఐదు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తితిదే ముఖ్య భద్రతాధికారి గోపీనాథ్ జెట్టి తెలిపారు. ఫిబ్రవరి రెండో తేదీన కనిపించకుండా పోయిన కిరీటాల విషయంలో కీలక ఆధారాలు సేకరించామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుని ఆభరణాలు స్వాధీనం చేసుకుంటామన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos