విరాట్ కంటే తోపులా ఉన్నాడుగా.!

  • In Sports
  • January 18, 2019
  • 799 Views
విరాట్ కంటే తోపులా ఉన్నాడుగా.!

రిషబ్ పంత్. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీమ్ లో సంచలనం. మొన్న ఆస్ట్రేలియాలో టూర్ లో అద్భుతంగా ఆడాడు. సెంచరీ కొట్టడంతో పాటు పరుగుల వరద పారించాడు. చూడ్డానికి విరాట్ కోహ్లి హెయిర్ స్టైల్ లో కన్పించే రిషబ్ పంత్ కు బుద్దులు కూడా విరాట్ వే వచ్చినట్లున్నాయి. కెరీర్ స్టార్టింగ్ లోనే విరాట్ అనుష్క ప్రేమలో పడ్డాడు. అయితే తాను అనుష్కతో ప్రేమలో ఉన్నానన్న విషయాన్ని చాన్నాళ్లు దాచాడు. ప్రేమ విషయంలో మధ్యలో కాస్త ఇబ్బందులు కూడా పడ్డాడు.

కానీ ప్రేమ విషయంలో మాత్రం రిషబ్ విరాట్ ని అస్సలు ఫాలో అవ్వడం లేదు. అందుకే తన ప్రేయసి ఫోటోని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. “నేను ఇంత ఆనందంగా ఉండటానికి కారణం నువ్వే. ఇదే ఆనందాన్నినీకు జీవితాంతం ఇస్తాను” అనే క్యాప్షన్ పెట్టాడు.రిషబ్ పంత్ ప్రేమిస్తున్న అమ్మయి పేరు ఇషా నేగి. వ్యాపారవేత్తగా ఉన్న ఇషా.. ఫ్యాషన్ డిజైనింగ్ లోనూ రాణిస్తోంది. రిషబ్ పోస్ట్ చేసిన ఫోటోని తన ఇన్స్టాలో షేర్ చేసింది ఇషా. “నా మనిషి. నా వాడు – నా బెస్ట్ ఫ్రెండ్ – నా ప్రియుడు” అంటూ తమ మధ్య ఉన్న బంధాన్ని ప్రపంచానికి చెప్పేసింది. చూస్తుంటే.. లవ్ విషయంలో రిషబ్ పంత్ విరాట్ కంటే తోపులా ఉన్నాడు.  

తాజా సమాచారం

Latest Posts

Featured Videos