వారి ఉడత బెదిరింపులకు బెదరను: ఎమ్మెల్యే మేడా

  • In Local
  • January 21, 2019
  • 825 Views
వారి ఉడత బెదిరింపులకు బెదరను: ఎమ్మెల్యే మేడా

వైఎస్ఆర్‌ జిల్లా రాజంపేట టిడిపిలో విభేదాలు భగ్గుమన్నాయి. స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డిని పిలవకుండానే మంత్రి ఆదినారాయణరెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో మేడా వర్గీయులు మంత్రిని నిలదీశారు. సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు. పొమ్మనలేక పొగబడుతున్నారంటూ మేడా వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డిని పార్టీ నుంచి బయటకు పంపేందుకు టీడీపీ అధిష్టానం తనదైన శైలిలో రాజకీయం ప్రారంభించింది. అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు నియోజకవర్గాల వారీగా చంద్రబాబునాయుడు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.త్వరలో రాజంపేట నియోజకవర్గ సమావేశం కూడా ఉంది. దీని కోసం నిన్న రాత్రి ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి తన అనుచరులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశాన్ని ఆసరాగా చేసుకుని ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రచారం చేపట్టింది. అంతటితో ఆగకుండా ఆయన వ్యతిరేకులతో మంత్రి ఆదినారాయణరెడ్డి సారథ్యంలో రాజంపేటలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే మేడాను పిలువలేదు. దీంతో ఆయన వర్గీయులు నేరుగా సమావేశం వద్దకు వెళ్లి.. మంత్రి ఆదినారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సమావేశం వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos