రోడ్డు ప్రమాదానికి గురైన ప్రిన్స్‌ ఫిలిప్‌

లండన్‌: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రాజకుటుంబానికి చెందిన శాండ్రింగ్‌హమ్‌ ఎస్టేట్‌ సమీపంలో ఫిలిప్‌ కారును మరో కారు ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంతో ఆయనకు ఎలాంటి హానీ జరగలేదు.97ఏళ్ల ప్రిన్స్‌ ఫిలిప్‌ శాండ్రింగ్‌హమ్‌ ఎస్టేట్‌ నుంచి స్వయంగా కారు నడుపుకొంటూ మెయిన్‌ రోడ్డుపైకి చేరుకోగానే అటుగా వేగంగా వస్తున్న మరో కారు ఆయనను ఢీకొట్టింది. దీంతో ఫిలిప్‌ కారు ఒక్కసారిగా బోల్తా పడి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని ఫిలిప్‌ను కారు నుంచి బయటకు తీశారు.అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఫిలిప్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ప్రమాదంతో ఆయన కాస్త షాక్‌కు గురైనట్లు తెలుస్తోంది. కాగా.. ఈ ఘటనలో మరో కారులోని ఇద్దరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదాన్ని బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ ధ్రువీకరించింది. ఫిలప్‌కు ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos