రేవంత్ రెడ్డి కి బంప‌ర్

రేవంత్ రెడ్డి కి బంప‌ర్

కాలం వీరుడికి ఎప్పుడూ స‌లాం చేస్తుంది. అలాగే రాజ‌కీయ‌ల్లో సామ‌ర్థ్యం
ఉన్న నేత‌కు అవ‌కాశాలు ఎప్పుడూ వెతుక్కుంటూ వ‌స్తాయి. రాజ‌కీయాల్లో ప్ర‌జా నిర్ణ‌యం
ఎప్పుడూ ఒకేలా ఉండ‌ద‌ని, కాలంతో పాటు మ‌రుతుంద‌ని కాంగ్రెస్ పార్టీ గ‌ట్టిగా విశ్వ‌సిస్తోంది.
అందుకే పోయిన చోటే వెతుక్కోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే పార్ల‌మెంట్
ఎన్నిక‌ల్లో సాద్య‌మైన‌న్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాల‌ని ఆ పార్టీ అదిష్టానం క్రుత
నిశ్చ‌యంతో ఉన్న‌ట్టు స‌మాచారం. అందులో భాగాంగానే టీపిసిసి వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ రేవంత్
రెడ్డిని ఆ స్థానం నుండి బ‌రిలో దిగేందుకు అదిష్టానం ఆదేశాలు జారీ చేసిన‌ట్టు స‌మాచారం.
తెలంగాణ కాంగ్రెస్ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్తరంగా మారాయి.
ఓట‌మి నుండి పాఠాలు నేర్చుకుని రెట్టింపు ఉత్సాహంతో మ‌ళ్లి ముంద‌డుగు వేస్తున్న‌ట్టు
ఆ పార్టీ వ్య‌వ‌హారం క‌నిపిస్తోంది. తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఓట‌మికి గ‌ల కార‌ణాల‌ను
విశ్లేషించుకుంటూనే మ‌రో యుద్దానికి సిద్ద‌ప‌డుతోంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ నెల‌కొన్న
ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను అదిగ‌మించేందుకు నాయ‌కులు స‌మ‌దైన శైలిలో ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం
చేసారు. ఇటీవ‌లే తెలంగాణాలోని 31జిల్లాల‌కు అద్య‌క్షుల‌ను నియ‌మించి పార్టీలో నూత‌న
ఉత్తేజాన్ని నింపే ప్ర‌య‌త్నం చేసింది కాంగ్రెస్ పార్టీ.
అంతే కాకుండా రానున్న పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో అనుకున్న
ఫ‌లితాలు సాధించేందుకు కూడా త‌న‌దైన వ్యూహంతో ముందుకు వెళ్తోంది తెలంగాణ కాంగ్రెస్
పార్టీ. అందులో భాగంగా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో
ఓట‌మి పాలైన అభ్య‌ర్థుల పేర్ల‌ను కూడా ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌జాబ‌లం
మెండుగా ఉన్న నేత‌ల‌ను పార్ల‌మెంట్ బ‌రిలో నింపేందుకు అదిష్టానం క‌స‌ర‌త్తు చేస్తోంది.
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ఫైర్ భ్రాండ్ గా ముద్ర వేసుకున్న రేవంత్ రెడ్డికి ఆ నియోజ‌క
వ‌ర్గం నుండి ఎంపీ గా పోటీ చేయాల‌ని కాంగ్రెస్ అదిష్టానం ఆదేశించిన‌ట్టు తెలుస్తోంది.
తెలంగాణ లో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల హ‌డావిడి మొద‌లైంది.
మొత్తం పార్ల‌మెంట్ స్థానాల్లో దాదాపు అన్ని స్థానాలు గులాబీ పార్టీ కైవ‌సం చేసుకుంటుంద‌ని
ఆ పార్టీ నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తుండ‌గా, సుమారు ఆరు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ
ప్ర‌భావం చూపుతుంద‌ని టీపిసిసి భ‌రోసా వ్య‌క్తం చేస్తోంది. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు,
ఇప్పుడు జ‌ర‌గ‌బోవు పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు తేడా ఉంటుంద‌ని, ప్ర‌జ‌ల ఆలోచ‌నా విధానంలో
కూడా మార్పు వ‌చ్చింద‌ని కంగ్రెస్ పార్టీ చెప్తోంది. అందులో బాగంగానే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో
కాంగ్రెస్ పార్టీ త‌న మార్క్ చూపించి అదికార పార్టీని ఖంగుతినిపిస్తుంద‌ని కాంగ్రెస్
పార్టీ నేత‌లు చెప్తున్నారు.
ఇక తెలంగాణ లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఖ‌మ్మం
పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ రేవంత్ రెడ్డిని
బ‌రిలో దించేందుకు ఆ పార్టీ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్టు స‌మాచారం. ఖ‌మ్మం పార్ల‌మెంట్
నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేయాల్సిందిగా అదిష్టానం ఆదేశించిన‌ట్టు తెలుస్తోంది. కాగా
పోటీ చేసే అంశం లో తుది నిర్ణ‌యం తీసుకునేందుకు కాస్త స‌మ‌యం కావాల‌ని రేవంత్ రెడ్డి
ఆదిష్టానానికి విజ్ఞ‌ప్తి చేసిన‌ట్టు తెలుస్తోంది. అన్నీ క‌లిసొచ్చి రేవంత్ రెడ్డి
ఖ‌మ్మం పార్ల‌మెంట్ నుంచి పోటీ చేస్తే రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు ఖ‌చ్చితంగా మారే అవ‌కాశాలు
ఉన్న‌యాని కాంగ్రెస్ పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos