రామరాజు పాత్రలో చరణ్

  • In Film
  • February 11, 2019
  • 113 Views
రామరాజు పాత్రలో చరణ్

బాహుబలి వంటి విజయం అందించిన అనంతరం దర్శకుడు రాజమౌళి అత్యంత భారీ
వ్యయంతో చరణ్‌,తారక్‌లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌పై
రోజురోజుకు అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.ఆర్‌ఆర్‌ఆర్‌పై వస్తున్న ఊహాగానాలు,లీకవుతున్న
ఫోటోలు చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి.రెండు రోజుల క్రితం చిత్రానికి సంబంధించి
పోలీస్‌స్టేషన్‌ సెట్టింగ్‌ ఫోటోలు ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టించగా తాజాగా చిత్రానికి
సంబంధించి వినిపిస్తున్న మరొక అప్‌డేట్‌ మరింత ప్రకంపనలు సృష్టిస్తోంది.విశ్వసనీయ సమాచారం
మేరకు ఈ చిత్రంలో చరణ్‌ పోషిస్తున్న పాత్ర పేరు రామరాజు అని స్వాతంత్య్రం కోసం బ్రిటీషర్లకు
ఎదురు తిరిగే రామరాజు అనే పోలీసు పాత్రలో చరణ్‌ కనిపించనున్నాడు. దేశభక్తి నరనరాల్లో నింపుకున్న రామరాజు
బ్రిటీషర్ల పాలనలో పోలీసుగానే విధులు నిర్వర్తిస్తూనే సరైన సమయం కోసం ఎదురు చూస్తూ వాళ్ళను దెబ్బ కొట్టేందుకు వ్యూహం పన్నుతాడని అందులో భాగంగా వచ్చే ఇంట్రడక్షన్ ఫైట్ నే ఇప్పుడు వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులతో తీస్తున్నట్టు తెలిసింది.ప్రస్తుత షూట్ చరణ్ మీద మాత్రమే జరుగుతోంది. తర్వాత తారక్ వచ్చాక చెర్రి రిలీఫ్ అవుతాడు. కొంత టైం తీసుకుని ఈ ఇద్దరు కలిసి జాయిన్ అవుతారు. తారక్ ఎపిసోడ్ కూడా దీనికి ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో ఉంటుందట. దాని ప్రీ ప్లానింగ్ కూడా మరోవైపు జరిగిపోతున్నట్టు సమాచారం. ఇది విన్న మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మూడు ఆర్ లలో ఒక ఆర్ చరణ్ చేస్తున్న రామరాజు అని తెలిసిపోయింది. మరి రెండో ఆర్ తారక్ పేరు అయ్యుంటుంది. ఆ మూడో ఆర్ మాత్రం సస్పెన్స్. అయితే షూటింగ్ ప్రారంభంలో వచ్చిన రామరావణ రాజ్యంతో ఇది కనెక్ట్ అవుతున్నట్టే అనిపిస్తోంది. ఇంకొద్ది రోజులు ఆగితే క్లారిటీ వచ్చేస్తుందిగా

తాజా సమాచారం

Latest Posts

Featured Videos