రామమందిరం కేసుమళ్లీ మొదటికి

రామమందిరం కేసుమళ్లీ మొదటికి

 
 అయోధ్య రామమందిరం కేసు వివాదంలో లేని భూమిపై కేంద్రం వేసిన రిట్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ… సుప్రీంకోర్టులో మరో వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. అయోధ్యలో బాబ్రీ మసీదు-రామమందిరం కేసులో వివాదంలో లేని స్థలాన్ని రామజన్మభూమి న్యాస్‌కు లేదా రామమందిర నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాలు చూస్తున్న ట్రస్టుకు అప్పగించాలని కోరుతూ సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం ఇటీవల పిటిషన్‌ దాఖలు చేసింది. బాబ్రీ మసీదు మొత్తం భూమిని యధాతథంగా ఉంచాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. రామ జన్మభూమి-మసీదు వివాదాస్పద ప్రాంతం 2.77 ఎకరాలు కాగా 1991లో ప్రభుత్వం దాంతోపాటు వివాదాస్పద స్థలం చుట్టూ ఉన్న 67 ఎకరాలను కూడా స్వాధీనం చేసుకుంది. ఐతే.. ఆ 67 ఎకరాల్లోని 1200 చదరపు అడుగుల స్థలమే వివాదాస్పదమైనదని.. అందుకే.. ఆ స్థలాన్ని రిలీజ్‌ చేయాలని కేంద్రం కోరింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos