రాజకీయ స్వార్థానికి జవాన్ల బలి

రాజకీయ స్వార్థానికి జవాన్ల బలి

చెన్నై: పాక్‌ , భారత్‌ నేతల వైఖరులే వీర జవాన్లను బలి తీసుకుంటున్నాయని  ప్రముఖ నటుడు, మక్కళ్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్‌ వ్యాఖ్యానించారు. చెన్నైలో సోమవారం జరిగిన ఒక సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘‘ఒక సైనికుడు ఎందుకు అకాల మృత్యువాతపడాలి.? రెండు వైపులా రాజకీయ నాయకులు సవ్యంగా, సక్రమంగా ప్రవర్తిస్తే ఓ సైనికుడు అర్ధాంతరంగా మృత్యువాత పడడు. అప్పుడు సరిహద్దు రేఖ సైతం నియంత్రణలో ఉంటుంది. మయ్యం పత్రికకు రాసిన వ్యాసంలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంతో పాటు ఏం జరగబోతోందో కూడా రాశాను. ఇప్పుడు నేను దు:ఖంలో మునిగిపోయాను. “అని ఆక్రోశించారు. ‘‘పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని రైళ్లలో జీహాదీలను హీరోలుగా చిత్రికరించి ఫోటోలు ప్రదర్శిస్తున్నారు. ఇది బుద్ధిహీనమైన చర్య. భారత్ కూడా ఇందుకు ఏ మాత్రం తేడా లేకుండా ప్రవర్తిస్తోంది. ఇది మంచిది కాదు. భారత్ మంచి దేశమని నిరూపించదల్చుకుంటే..ఇలా చేయకూడదు. 40 మంది భారత సైనికుల మరణంపై తీవ్ర విచారాన్నివ్యక్తీకరించారు.  

జనాభిప్రాయాన్ని
సేకరించండి.

కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేపట్ట లేదని కేంద్రాన్ని ప్రశించారు. వెంటనే ఆ
పని చేయాలని డిమాండు చేసారు. “కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి. ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు అవకాశం ఇవ్వాలి. ప్రజా భిప్రాయాన్ని సేకరించేందుకు ఎందుకు భయపడుతున్నారు?’’వ్యాఖ్యాననించారు.  కమల్  వ్యాఖ్యలు వివాదాస్పదం కావటంతో.. ఆయన మాటలను అపార్థం చేసుకున్నారని ఆయన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ పార్టీ భారత సైనికులతో భుజం భుజం కలిపి నిలుస్తుందనీ… కశ్మీర్ భారత దేశంలో అంతర్భాగమేనని నమ్ముతున్నామని స్పష్టీకరించింది. 
మూడు దశాబ్దాల కిందట ప్రచురించిన ఓ పత్రిక వ్యాసాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనీ.. ఇవాళ నెలకొన్న పరిస్థితి ఆ పుస్తకానికి సంబంధం లేదని విపులీకరించింది.

స్టాలిన్‌పై విమర్శ

డిఎంకె నేత స్టాలిన్‌ను కూడా కమల్‌ హాసన్‌ తప్పు బట్టారు. “దశాబ్దాలుగా గ్రామ సభలు ఉన్నాయి. ఈ సమావేశాలను నేను నిర్వహించడం మొదలు పెట్టాక ఇతరులు అనుసరిస్తున్నారని” అన్నారు. డిఎంకె అధినేత స్టాలిన్‌ ఇటీవల గ్రామ సభలను నిర్వహించటం ఇక్కడ ప్రస్తావనార్హం.  ఇప్పుడే ఎదుగుతున్న పార్టీ నుంచి ఇటువంటి కార్యక్రమాలు నకలు చేసినందుకు  సిగ్గు లేదా అని ప్రశ్నించారు. డిఎంకె అధినేత స్టాలిన్‌ ఇటీవల గ్రామ సభలను నిర్వహించటం ఇక్కడ ప్రస్తావనార్హం. “నేను విధానసభకు పోయినపుడు చినిగిన చొక్కా ధరించనని, ఒక వేళ చినిగిపోతే , మరొక చొక్కాను ధరిస్తానని స్టాలిన్‌ను ఉద్దేశించి  పరోక్షంగా వ్యాఖ్యానించారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos