యడ్యూరప్పకు కేంద్ర మంత్రి వేడుకోలు

యడ్యూరప్పకు కేంద్ర మంత్రి వేడుకోలు

న్యూఢిల్లీపాక్‌తో కయ్యానికి దిగటం
వల్ల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి చేకూరుతుందని
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పచేసిన వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ సహాయమంత్రి, విశ్రాంత పదాతి దళాధిపతి వి.కె. సింగ్ తీవ్రంగా కలత  చెందారు. పాకిస్తాన్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్) జరిపిన మెరుపు దాడులను చూపిస్తూ యడ్యూరప్ప  ఓట్లు అడగడాన్ని తప్పుపట్టారు. ఉగ్రమూకలపై వాయు సేన దాడితో మోదీ ప్రాబల్యం పెరిగి 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ రాష్ట్రంలో 22 స్థానాలు గెలుచుకోవడం ఖాయమని యడ్యూరప్ప పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై వీకే సింగ్ గురువారం ట్విటర్లో స్పందించారు.‘‘యడ్యూరప్ప గారూ  దయ చేసి మీరిలా మాట్లాడవద్దని చేతులెత్తి మొక్కుతున్నాను. మన మంతా ఒకే దేశంగా నిలబడాలి. దేశాన్ని కాపాడేందుకు, దేశ భద్రతపై ప్రజలకు భరోసా కల్పించేందుకే మన ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఏదో కొన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుందామని కాదు.’’ అని స్పష్టీకరించారు.  దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 1996లో పార్లమెంటులో చేసిన ప్రసంగాన్ని షేర్ చేసిన వీకే సింగ్ అటల్‌జీ చేసిన ఈ ప్రసంగం మోదీ ప్రభుత్వాన్ని
మరింత ఉన్నత స్థానంలో నిలుపుతుంది’ అని ఆశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos