మోదీని హిట్లర్‌తో పోల్చిన సీనియర్ నేత

మోదీని హిట్లర్‌తో పోల్చిన సీనియర్ నేత

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చుతూ కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే విమర్శలు సంధించారు. యూపీయే ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ… ‘‘ఆయన ఎవరి మాటైనా వింటారా? ఆయనకు తోచిందే చేస్తున్నారు. రాత్రికిరాత్రి సీబీఐ డైరెక్టర్‌ను తొలగించారు. నోట్లరద్దు కూడా అలాగే చేశారు. ఇది నియంతృత్వం కాదా? ఆయన ఎవరినైనా సంప్రదించారా? కనీసం ఆర్ధిక మంత్రిని గానీ, ఆర్బీఐ గవర్నర్‌నిగానీ ఒక్కమాట కూడా అడగకుండా పెద్దనోట్లు రద్దు చేసేశారు. ఇది నియంతృత్వమే…’’ అని పేర్కొన్నారు. గతంలోనూ ప్రధాని మోదీపై షిండే ఇదే తరహాలో మండిపడిన సంగతి తెలిసిందే. రాజ్యాంగం, ప్రజాస్వామ్యమే తనను ప్రధానిని చేశాయని చెప్పుకోవడం మోదీకి ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. ‘‘టీ అమ్మకునే వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాడంటూ మోదీ పదేపదే చెబుతారు. రాజ్యాగం, ప్రజాస్వామ్యమే తనను చాయ్‌వాలా నుంచి ప్రధాని అయ్యేందుకు అవకాశం ఇచ్చినట్టు మాత్రం ఒప్పుకోరు…’’ అని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos