మోదీకి బాబు హెచ్చరిక

మోదీకి బాబు హెచ్చరిక

అమరావతి: ఆంధ్రప్రదేశకు ఇచ్చిన హామీల్ని
 ఈడేర్చాకే తమ రాష్ట్రంలో కాలు మోపాలని ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు శనివారం ప్రధాని నరేంద్ర మోదీని హెచ్చరించారు. తెదేపా నేతలతో ఇక్కడి
నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.‘ ప్రధాని మాయ మాటలు చెబితే కుదరదు. మనల్ని విమర్శించడానికే
వస్తానంటే మాత్రం దిల్లీలోనే కూర్చోవాలని’ హితవు పలికారు.‘ ఆనాడు ఢిల్లీ కుట్రలు ఎలా తిప్పికొట్టారో మహా నాయకుడు సినిమాలో
చూపారని, ఇప్పుడూ అదే చేయాలని’ పిలుపు నిచ్చారు. ఈ ఏడాదిలో ఆరు  నెలల పాటు వరుసగా ఎన్నికలు ఉన్నందున ప్రజలతో  మరింత మమేకం కావాలని విన్నవించారు. ఆంధ్రప్రదేశ్
కు ప్రత్యేక హోదా తెలుగు దేశం పార్టీ డిమాండు కాగా దీన్ని కాంగ్రెస్‌ అధినేత  రాహుల్ గాంధీ కూడా సమర్థించారని చెప్పారు.  వైకాపాకు ఎన్నికల్లో పడే ప్రతి ఓటూ కేసీఆర్‌, మోదీకి
దక్కినట్లేనని విశ్లేషించారు. మూడు పార్టీల నోటా ఒకే మాట రావటం ఇందుకు తిరుగులేని సాక్షాలని
పేర్కొన్నారు.  రాష్ట్ర భవిష్యత్తు కోసం విభేదాలు
వీడి చిరకాల ప్రత్యర్ధులు ఆది నారాయణ  రెడ్డి-రామసుబ్బారెడ్డి,
కోట్ల-కేఈ కుటుంబాలు తెదేపాలో చేరాయని చెప్పారు. దీన్ని పార్టీ శ్రేణులు   కూడా స్పూర్తిగా తీసుకోవాలని విన్నించారు.  రాయలసీమలో తెదేపా పట్ల పూర్తి సానుకూల వాతావరణం
నెలకొందని అభిప్రాయపడ్డారు. సాగు నీరిచ్చి పంట దిగుబడులు పెంచామన్నారు. రాయలసీమలో
 ఊరూరా కృష్ణా జలాలకు రైతులు మంగళ
హారతులిస్తున్నారని సంతోషించారు.  రైతుల్లో
పార్టీ పట్ల ఏర్పడిన పూర్తి సానుకూలతే శుభపరిణామమని ఆశించారు. అమలు చేసిన
అభివృద్ధి పనులు గురించి విస్తృత ప్రచారాన్ని చేయాలని పిలుపునిచ్చారు. 28న ఢిల్లీలో
జరగనున్న ఎన్డీయే ఇతర పార్టీల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తామని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos