మైదుకూరు టీడీపీ టికెట్ నాకే..

మైదుకూరు టీడీపీ టికెట్ నాకే..

రాయలసీమలో కూడా ఓ బీసీ నాయకుడు కావాలనే ఉద్దేశంతో టీటీడీ చైర్మన్‌ పదవిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు తనకు ఇచ్చారని, 2019లో తనకు టికెట్‌ ఇస్తారని పుట్టా సుధాకర్‌యాదవ్‌ స్పష్టం చేశారు. మరో 25 ఏళ్ల వరకు తానే అభ్యర్థిగా ఉంటానని ధీమా వ్యక్తం చే శారు. ఎళ్లవేళలా అండగా ఉంటానని కార్యకర్తలకు, నాయకులకు పుట్టా భరోసా ఇ చ్చారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మం గళవారం సాయంత్రం నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. గత ఎన్నికల సమయంలో పార్టీకి సరైన అభ్యర్ధిలేక తనకు ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగించడంతో వ్యాపారాలను విడిచి ప్రజల కోసం వచ్చానన్నారు. తెలుగుగంగ ద్వారా చెరువులకు నీరు తెప్పించానన్నారు. ఆదిరెడ్డిపల్లె, తువ్వపల్లె తదితర చెరువులకు లిఫ్ట్‌ ద్వారా నీళ్లు నింపేందుకు త్వరలో టెండర్ల పక్రియ ప్రారంభమవుతుందన్నారు. దాదాపు రూ. 900 కోట్లతో శాశ్వత పనులు చేపట్టానన్నారు. మైదుకూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో నాయకుల కలహాల వల్లే తమ పార్టీ అభ్యర్థిత్వంపై అపోహలు ఏర్పడుతున్నాయన్నారు. కార్యకర్తలు, నాయకులు అపోహలు వీడి ప్ర జల వద్దకు వెళ్లి గత నాలుగు ఏళ్ళుగా చేసిన అభివృద్ధిని వివరించాలన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ రంగసింహా, పట్టణ అధ్యక్షుడు దాసరి బాబు, మార్కెట్‌ చైర్మన్‌ బీపీ సుధాకర్‌, నాయకులు గుడిపాడు బాబు, మేకల రత్నకుమార్‌, వైవీ సుబ్బారెడ్డి, నేట్లపల్లి మల్లికార్జున, రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాసులు, ఏపీ రవీంద్ర, కొండపల్లి ఉమాకాంత్‌, గుండంరాజు సుబ్బయ్య, మైనార్టీ నాయకులు నాయ బ్‌, గౌస్‌, తదితరులు పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos