మూతపడనున్న ‘మీ సేవ’ కేంద్రాలు

రోలుగుంట(విశాఖ జిల్లా): పౌర సేవల సరళీకరణకు చేపట్టిన విప్లవాత్మక మార్పుల్లో భాగంగా ఏర్పాటైన ‘మీ సేవలు’ నిర్వాహకులకు భారంగా మారాయి. ప్రభుత్వ శాఖల సహకారం అంతంత మాత్రంగా ఉండడం, ప్రజలకు అవసరమైన అనేక రకాల సేవల్ని ఆన్‌లైన్‌ ద్వారా ఈ కేంద్రాల్లో అందించే క్రమంలో నిర్వహణ భారంగా మారడం, చాలీచాలని కమీషన్‌, ఉద్యోగ భద్రత లేకపోవడం, ఆన్‌లైన్‌ పద్థతిలో చేయాల్సిన పనులను తిరిగి మాన్యువల్‌కు మార్చడం వంటి విధానాలను వ్యతిరేకిస్తున్న సదరు కేంద్రాల నిర్వాహకులు ఆందోళనకు దిగుతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 17 నుంచి మీ-సేవ కేంద్రాలను బంద్‌ చేసి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు ఏపీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) స్పష్టం చేసింది. రాష్ట్రంలో 9000కు పైగా కేంద్రాల మూత!సమ్మెపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ర్టానిక్‌ సర్వీసెస్‌ డెలివరీ (ఈఎస్‌డీ) కమిషనర్‌కు, జిల్లా కలెక్టర్లకు, జాయింట్‌ కలెక్టర్లకు, తహల్దార్లకు ఆయా జేఏసీ ప్రతినిధుల బృందం సమ్మె నోటీసులు అందజేశారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే సమస్యలు పరిష్కారమయ్యే వరకు రాష్ట్రంలో 9000కు పైగా మీ-సేవ కేంద్రాలను మూసేయనున్నారు. సమ్మె మొదలైతే ప్రజలకు అవసరమైన అనేక రకాల సేవలు స్తంభించే పరిస్థితి నెలకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో కొర్రీలు!మీ సేవ కేంద్రాల్లో పూర్తిగా ఆన్‌లైన్‌ పద్ధతిలోనే సర్వీసులు అందించాలి. పౌరుల నుంచి దరఖాస్తులు తీసుకొని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన తర్వాత సంబంధింత అధికారుల యూజర్‌ ఐడీకి దరఖాస్తులను పంపించడం వంటి విధులను ఈ కేంద్రాలు నిర్వహిస్తాయి. ఈ క్రమంలో పలు కార్యాలయాల్లో కొర్రీలు పెడుతున్నాయని నిర్వాహకులు ఆందోళన చేస్తున్నారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపడంతో పాటు వాటిని ప్రింట్‌ తీసి మాన్యువల్‌గా ఇస్తేనే అప్‌డేట్‌ చేస్తామంటూ తహసీల్దార్‌ కార్యాలయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో సేవలు అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అరకొర కమీషన్‌తో అవస్థలురాష్ట్రంలోని వివిధ రకాల కంపెనీల ద్వారా తొమ్మిది వేలకు పైగా మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీ ఆన్‌లైన్‌, శ్రీవెన్‌, రామ్‌ ఇన్‌ఫో, కార్వీ, సీఎంఎస్‌ తదితర కంపెనీలు వీటికి సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నాయి. మీ సేవ కేంద్రాల్లో అందించే పౌర సేవలకు ఈ కంపెనీల ద్వారా కమీషన్‌ అందుతుంది. కేటగిరి-ఎ కింద రూ.11 నుంచి 12.90 వరకు చెల్లిస్తుండగా, కేటగిరి-బి కింద రూ.17 నుంచి 18.50 కమీషన్‌ చెల్లిస్తున్నారు. అలాగే మీ సేవ నిర్వాహకులే స్టేషనరీ ఖర్చులు భరించాల్సి ఉంటుంది. నిర్వాహకుల డిమాండ్లు ఇవీ..ప్రతి మీ సేవ కేంద్రంలో పని చేసే నిర్వాహకునికి కార్మిక చట్టం ప్రకారం కనీస వేతనం రూ.18,500 చెల్లించాలని, కేటగిరి-ఏకు రూ.25, కేటగిరి-బికు రూ.30 కమీషన్‌ పెంచి ఆపరేటర్‌కు కనీస ఆదాయం వచ్చేలా చూడాలని కోరుతున్నారు. అంతేకాకుండా కమీషన్లు పెంచినా కొంతమంది గ్రామీణ ప్రాంతాల ఆపరేటర్లకు ప్రభుత్వం కనీస భృతిని రూ.15 వేలు కల్పించాలని, 2012 నుంచి అమలు చేస్తున్న రెండు రూపాయల స్కానింగ్‌ చార్జీలను ఐదు రూపాయలకు పెంచాలని, ప్రస్తుతం వసూలు చేస్తున్న 18 శాతం జీఎస్టీని మినహాయించాలని, ఆపరేటరు మృతిచెందితే సదరు కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కొత్త సేంటర్లు ఇచ్చినప్పుడు పక్క పక్కనే కాకుండా పరిధి పాటించాలని, ఉద్యోగ భద్రత కల్పించి, ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేయాలన్న తదితర డిమాండ్లను ప్రభుత్వం ముంద ుంచి గురువారం నుంచి సమ్మెకు దిగుతున్నారు. 600 సేవలకు ప్రస్తుతం అందించేవి 40 సేవలే!నలభై ప్రభుత్వ శాఖల నుంచి 600 సేవలను ప్రజలకు అందించాల్సిన మీ సేవ కేంద్రాలు, నేడు అధికారుల సహకారం లేకపోవడంతో కేవలం 40 సేవలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోందని నిర్వాహకులు వాపోతున్నారు. కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు రైతులకు అందించే ఈ- పాసు పుస్తకాల దరఖాస్తులను మీ సేవకేంద్రాల నుంచే తహసీల్దార్‌ కార్యాలయానికి పంపాలి. వాటి నిర్వహణ ఖర్చులతో పాటు ప్రభుత్వం జీఎస్‌టీని కూడా నిర్వాహకుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తుండడంతో ఆదాయం తగ్గుతుందని వీరు చెబుతున్నారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos