మహానాయకుడిపై ఓ కన్నేసిన బాబు అండ్ కో

  • In Film
  • February 8, 2019
  • 102 Views
మహానాయకుడిపై ఓ కన్నేసిన బాబు అండ్ కో

బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించి నిర్మించిన ‘ఎన్టీఆర్’ మూవీ మొదటి పార్ట్ కథానాయకుడు సంక్రాంతికి విడుదలైన విషయం తెల్సిందే. పాజిటివ్ టాక్ వచ్చినా వివాదాస్పద అంశాలు లేకపోవడంతో ప్రేక్షకులు సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. దాంతో కథానాయకుడు కలెక్షన్స్ మరీ దారుణంగా వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి జరిగిన నష్టంను ఎన్టీఆర్ మహానాయకుడితో పూడ్చాలని క్రిష్ భావిస్తున్నాడట. అందుకే సినిమాలో కాస్త వివాదాస్పద అంశాలను జోడించే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

మొదటి పార్ట్ విడుదలైన వెంటనే రెండవ పార్ట్ ను విడుదల చేయాలని భావించారు. కాని విడుదల వాయిదా పడుతున్న నేపథ్యంలో ఆ వివాదాస్పద అంశాలను ఏమైనా జోడిస్తున్నాడా అనే అనుమానాలకు బలం చేకూరుతుంది. మహానాయకుడు సినిమాను ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్ పరంగా చూపించబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడును ఎలా చూపిస్తారనే విషయమై ఆసక్తికర చర్చ జరుగుతుంది.సినిమాకు క్రేజ్ తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో ఏమైనా బాబును నెగటివ్ గా చూపించేందుకు క్రిష్ ప్రయత్నిస్తున్నాడా అనే అనుమానాలు తెలుగు దేశం పార్టీ నాయకుల్లో వ్యక్తం అవుతుందట. అందుకే సినిమా పూర్తి అయ్యి సెన్సార్ కు వెళ్లక ముందే బాబు ప్రత్యేక షో చూడాలనుకుంటున్నాడట. బాలయ్య కూడా చంద్రబాబుకు ప్రత్యేక షో వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మహానాయకుడు సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యిందని శివరాత్రి సందర్బంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో క్రిష్ అండ్ కో ఉన్నట్లుగా తెలుస్తోంది. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos