మన్మోహన్ సింగ్ కులమేంటో తెలియదు..: పాశ్వాన్

మన్మోహన్ సింగ్ కులమేంటో తెలియదు..: పాశ్వాన్

న్యూఢిల్లీ: మన్మోహన్ సింగ్ తప్ప దేశాన్ని పాలించిన ప్రధానులంతా అగ్రకులాలకు చెందిన వారేనని ఎల్‌జేపీ చీఫ్ రామ్ విలాస్ పాశ్వాన్ పేర్కొన్నారు. అయితే మన్మోహన్ సింగ్ కులమేంటో మాత్రం తనకు తెలియదంటూ దాటవేశారు. అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు పాశ్వాన్ స్పందిస్తూ… ‘‘మన్మోహిన్ సింగ్ కులమేంటో నాకు తెలియదుగానీ.. ఆయన ఒక్కరు తప్ప కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానులుగా పనిచేసిన వారంతా అగ్రకులాలకు చెందిన వారే. మరి వాళ్లు ఎందుకు పేద ‘సవర్ణాల’ కోసం రిజర్వేషన్లు తీసుకురాలేదు..’’అని ప్రశ్నించారు. అగ్రవర్ణాల్లో ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం ప్రభుత్వం ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికోసం పార్లమెంటులో ప్రవేశేప 124వ చట్టసవరణ బిల్లు కూడా ఇరు సభల్లోనూ జెట్ స్పీడుతో ఆమోదం పొందింది. కొత్త రిజర్వేషన్లు చట్టం రూపు దాల్చేందుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం ఒక్కటే మిగిలిఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos