మధ్యప్రదేశ్‌ రైతుల రుణమాఫీకి భారీ పథకం

మధ్యప్రదేశ్‌ రైతుల రుణమాఫీకి భారీ పథకం

మధ్యప్రదేశ్‌: రాష్ట్రంలో రైతుల రుణమాఫీకి ప్రభుత్వ భారీ పథకం సిద్ధం చేస్తోంది. జై కిసాన్‌ రుణ్‌ ముక్తి యోజన పేరుతో… రూ.50 వేల కోట్ల పంట రుణాల్ని మాఫీ చేయనుంది. బడ్జెట్‌ పరిమితులు లేకుండా పథకం అమలు చేయడానికి సీఎం కమల్‌నాథ్‌ కసరత్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కమల్‌నాథ్.. తొలి సంతకం రైతుల రుణమాఫీ ఫైలుపైనే చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. ప్రమాణస్వీకారం చేసిన కొద్దిసేపట్లోనే తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన కమల్‌నాథ్.. రైతులకు రెండు లక్షల వరకు పంటరుణాలు మాఫీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫైలుపైనే తొలి సంతకం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos