మండుటెండలు ఖాయం?

మండుటెండలు ఖాయం?

న్యూఢిల్లీ : బ్రిటన్ వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. 2014-2023 దశాబ్దం 150 ఏళ్ళలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే దశాబ్దంగా రికార్డు సృష్టిస్తుందని పేర్కొంది. రాబోయే ఐదేళ్ళలో ఉష్ణోగ్రతల పరిస్థితులను వివరిస్తూ, ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ కన్నా 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాబోతున్నట్లు పేర్కొంది. 2015లో మొట్టమొదటిసారి ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ కన్నా 1 డిగ్రీ అధికంగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరిగిందని తెలిపింది. అప్పటి నుంచి ఈ పరిస్థితి కొనసాగుతోందని పేర్కొంది. ఈ పెరుగుదల 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయని తెలిపింది. తాత్కాలికంగానే అయినా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు తెలిపింది. ఉష్ణోగ్రతల నమోదు 1850 నుంచి మొదలైంది. 2018లో నమోదైన ఉష్ణోగ్రతలు నాలుగో అత్యధిక స్థాయి ఉష్ణోగ్రతలని వెల్లడైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos