మంచు మనోజ్ కూడా నిలదీస్ఫైయింగ్

  • In Film
  • February 11, 2019
  • 159 Views
మంచు మనోజ్ కూడా నిలదీస్ఫైయింగ్

మంచు లక్ష్మి ఒకానొక సందర్బంలో మాట్లాడుతూ ఐయామ్ నిలదీస్ఫైయింగ్ అంటూ కొత్త వ్యాఖ్య చేసిన విషయం తెల్సిందే. ఆ వ్యాఖ్యపై కూడా పెద్ద ఎత్తున మీమ్స్ వచ్చాయి. అయితే వాటిని కూడా మంచు ఫ్యామిలీ సరదాగానే తీసుకుంది. తాజాగా మరోసారి ఆ పదాన్ని మంచు మనోజ్ వాడటం జరిగింది. మరెవ్వరైనా తమ వ్యాఖ్యలపై ఇంతగా మీమ్స్ ట్రోల్స్ వస్తే సిగ్గు పడతారు లేదంటే కోప్పడతారు. కాని మంచు ఫ్యామిలీ మాత్రం మళ్లీ మళ్లీ ఆ పదాలను వాడుతూ ఉన్నారు.’ఫసక్’ పదంతో ఒక సినిమానే తీసేందుకు మంచు విష్ణు సిద్దం అయ్యాడు. తాజాగా మంచు మనోజ్ మోడీకి వ్యతిరేకంగా పెట్టిన ట్వీట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక వ్యక్తి మంచు మనోజ్ పై ట్వీట్ చేశాడు. కేంద్రం ఇచ్చిన ఐదు లక్షల కోట్లను చంద్రబాబు ఎలా ఖర్చు చేశారో ప్రశ్నించండి క్యాస్టియెస్ట్ ఇడియట్ అంటూ కామెంట్ చేశాడు. అతడి కామెంట్ కు మనోజ్ కూడా సీరియస్ అయ్యాడు. పేరు వెనుక రెడ్డి క్యాస్ట్ పెట్టుకున్నది నువ్వా నేనా.. మరి క్యాస్టియోస్ట్ ఇడియట్ ఎవరు ఐయామ్ నిలదీస్ఫైయింగ్ అంటూ సీరియస్ ట్వీట్ లో సరదాగా ఈ పదం వాడాడు. మనోజ్ సమయస్ఫూర్తికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos