భారత ఫార్మా ఉత్పత్తుల రీకాల్‌

  • In Money
  • January 21, 2019
  • 757 Views
భారత  ఫార్మా ఉత్పత్తుల రీకాల్‌

ముంబయి: భారత్‌ దిగ్గజ ఫార్మా కంపెనీలు తమ ఔషదాలను అమెరికా మార్కెట్‌ నుంచి రీకాల్‌ చేశాయి. వీటిల్లో లుపిన్‌, సన్‌ఫార్మా, గ్లెన్‌మార్క్‌ వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ విషయం అమెరికా ఎఫ్‌డీఏ తాజా నివేదిక‌లో వెల్లడైంది.  లుపిన్‌ సంస్థ 55 వేల వైల్స్‌, 1.6 పెట్టెల సెఫిట్రయాక్సిన్‌ ఇంజెక్షన్లను వాపస్‌ తీసుకుంది. వీటిని  మధ్యప్రదేశ్‌లోని మందీదీప్‌ ప్లాంట్‌లో తయారు చేశారు. వీటిల్లో కొన్ని అవాంఛనీయ పదార్థాలను గుర్తించ‌డంతో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. వీటితోపాటు 2.8 సీసాల సెఫ్డినీర్‌ సిరప్‌ను కూడా వెనక్కి రప్పించింది. ఇదే విధంగా సన్‌ఫార్మా 13,918 కార్టన్ల వెక్యూరోనమ్‌ బ్రొమైడ్‌ ఇంజెక్షన్లను వాపస్‌ తీసుకొంది. జనరల్‌ అనస్తీషియాగా దీనిని వినియోగిస్తారు. వీటిల్లో కూడా కొన్ని అవాంఛనీయ పదార్థాలు ఉండటంతో వాపస్‌ తీసుకొన్నట్లు సమాచారం. ఇక గ్లెన్‌మార్క్‌ ఫార్మస్యూటికల్స్‌ 96,240 ఎస్ట్రాడియోల్‌  పరికరాలను వాపస్‌ తీసుకొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos