భాజపా నమ్మక ద్రోహి:చంద్రబాబు

భాజపా నమ్మక ద్రోహి:చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీని హెచ్చరించారు.ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలు డిమాండ్లతో దిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో సోమవారం ‘ధర్మపోరాట దీక్ష’ పేరుతో నిరాహార దీక్ష నిర్వహించిన చంద్రబాబు మంగళవారం అదే డిమాండ్‌తో దిల్లీలో నిరసన ప్రదర్శన చేపట్టారు.చంద్రబాబు మంగళవారం ఉదయం 11 గంటలకు ఏపీ భవన్ నుంచి జంతర్ మంతర్ వరకూ పాదయాత్ర చేసారు.. పలువురు మంత్రులు, ఎంఎల్‌ఏలు, పార్టీ కార్యకర్తలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.జంతర్ మంతర్ దగ్గరి నుంచి చంద్రబాబు సహా 11 మంది ప్రతినిధుల బృందం వాహనాల్లో రాష్ట్రపతి భవన్‌కు బయల్దేరి వెళ్లింది.ప్రత్యేక హోదా హామీ అమలుతో పాటు.. విభజన చట్టంలోని 18 అంశాలను అమలు చేయాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు 17 పేజీల వినతిపత్రం సమర్పించింది విభజన చట్టంలోని అంశాలు, రాజధాని నిర్మాణం, రెవెన్యూ లోటు భర్తీ తదిరత అంశాలను చంద్రబాబు రాష్ట్రపతికి వివరించారు. .రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరే ముందు జంతర్ మంతర్ వద్ద చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.హైదరాబాద్‌ను 60 ఏళ్ల పాటు అభివృద్ధి చేశాం. అభివృద్ధి చేసి కూడా హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో బయటకు వచ్చాం. కొత్త రాష్ట్రంలో అందరం ఎంత కష్టపడినా, కేంద్రం సహకరించినా 20, 30 సంవత్సరాలు పడుతుంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.‘‘అలాంటి సమయంలో కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. మా మనోభావాలతో ఆడుకుంటోంది. అందుకే దిల్లీ వీధుల్లో నిరసనయాత్ర చేస్తున్నాం’’ అని చెప్పారు.‘‘ఇప్పటికైనా కేంద్రం స్పందించాలి. సరిగ్గా స్పందించకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్రమోదీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా’’ అని అన్నారు.‘‘ఈ దీక్ష రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాం. ప్రజా పోరాటాలు చేస్తాం. ప్రజల కోర్టులోనే మిమ్మల్ని చిత్తుచిత్తుగా ఓడిస్తాం’’ అని చంద్రబాబు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారుప్రధాని మోదీలో నాయకత్వ లక్షణాలు లేవని, దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఆశయం ఏమాత్రం ఆయనకు లేదని విమర్శించారు. తాము న్యాయం కోసం పోరాడుతుంటే, భాజపా నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారి జాతకాలు విప్పితే మళ్లీ తలెత్తుకుని తిరగలేరని హెచ్చరించారు.విభజన చట్టంలోని అంశాలు, రాజధాని నిర్మాణం, రెవెన్యూ లోటు భర్తీ తదిరత అంశాలను చంద్రబాబు రాష్ట్రపతికి వివరించారు.అనంతరం నిర్వహించిన మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రపతి రాజ్యంగఅధినేత
రాష్ట్రపతి,అంతిమంగా నిర్ణయాలు తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనన్నారు. తమకు న్యాయం జరగకుంటే కోర్టు తలుపులు తడతామని, అక్కడా న్యాయం జరగకుంటే ప్రజాక్షేత్రాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అబద్ధాలతోనే భాజపా కాలం వెళ్లదీస్తోందన్నారు. అందుకు రాష్ట్రంలో వైకాపా సహకరిస్తోందన్నారు. భాజపా, వైకాపా కలిసి పోటీ చేయాలని చెప్పారు. రాష్ట్రంపై అంత చిత్తశుద్ధే ఉంటే తెదేపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. హోదా కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాకుళం వాసి మృతి పట్ల చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు..‘‘జగన్, మోదీ ఒక్కటే. జగన్ స్వప్రయోజనాల కోసం మోదీకి ఊడిగం చేస్తున్నారు’’ అంటూ మరో ప్రశ్నకు సమాధానంగా ఏపీలో ప్రతిపక్ష నాయకుడు .ఎ‌స్.జగన్‌మోహన్‌రెడ్డి మీద విమర్శలు చేశారు.ప్రత్యామ్నాయ కూటమికి జగన్ ఎన్నికల తర్వాత మద్దతు ఇస్తామంటే ఇవ్వనివ్వండి అంటూ చంద్రబాబు సోమవారం చేసిన వ్యాఖ్య మీద ఒక విలేకరి వివరణ కోరారు.‘‘అవినీతిపరులను ఎవరు తీసుకుంటారు? రేపు వచ్చే ప్రత్యామ్నాయం.. నరేంద్రమోదీ ప్రభుత్వం మాదిరిగా అవినీతిపరులను రక్షించదు. ఇష్టమై వచ్చి సపోర్ట్ చేస్తే చేసుకోమను అని చెప్పాను’’ అని చంద్రబాబు స్పందించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos