బోయపాటికి బాలయ్య హామీ…

  • In Film
  • February 12, 2019
  • 119 Views
బోయపాటికి బాలయ్య హామీ…

సంక్రాంతికి విడుదలైన ‘వినయ విధేయ రామ’ సినిమా బాక్సాఫీసు వద్ద
బోల్తా పడడం, ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లు దాదాపు 30 కోట్ల మేర నష్టపోవడం తెలిసిందే.
డిస్ట్రిబ్యూటర్ల నష్టాలకు పరిహారం చెల్లించాలని హీరో రామ్ చరణ్, నిర్మాత దానయ్య నిర్ణయిచడం,
బోయపాటి తన రెమ్యూనరేషన్ నుంచి డబ్బు తిరిగి ఇవ్వడానికి ససేమిరా అనడంతో వివాదం మొదలైనట్లు
వార్తలు వినిపిస్తున్నాయి. బోయపాటి తీరు మెగా క్యాంపుకు ఆగ్రహం తెప్పించిందని, ఆయనకు
ఇకపై మెగా క్యాంపస్‌లో అడుగు పెట్టే అవకాశం ఉండక పోవచ్చని, దాదాపుగా దారులు మూసుకుపోయినట్లే
అనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి.
వినయ విధేయ రామ’ ప్లాప్ అయినప్పటికీ బోయపాటికి బాలయ్య
నుంచి ఫుల్ సపోర్ట్ లభించినట్లు తెలుస్తోంది. వారి కాంబినేషన్లో త్వరలో రాబోయే సినిమా
టాలీవుడ్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అవుతోంది.
బాలయ్యతో చేయబోయే సినిమాకు సంబంధించి బోయపాటి ఆల్రెడీ
స్క్రిప్టు కూడా వినిపించారని, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. నీకు
ఏదైనా సమస్య ఉంటే చెప్పు నేను డీల్ చేస్తానంటూ బాలయ్య హామీ ఇచ్చారట.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos