బుల్లి బుమ్రా బౌలింగ్‌ చూశారా?నెట్టింట్లో వైరల్‌ అవుతున్న వీడియో

బుల్లి బుమ్రా బౌలింగ్‌ చూశారా?నెట్టింట్లో వైరల్‌ అవుతున్న వీడియో
ఇంటర్నెట్‌ డెస్క్‌: పేసర్లలో బుమ్రా బౌలింగ్‌ శైలి వేరుగా ఉంటుంది. తన బౌలింగ్‌ స్టైల్‌తో బ్యాట్స్‌మెన్‌ను బురిడీ కొట్టిస్తాడు. ఒక్కోసారి అతను వేసే బంతి బ్యాట్స్‌మెన్‌ ఊహకు కూడా అందదు. ఇటీవల ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 21 వికెట్లు పడగొట్టిన బుమ్రా ఆస్ట్రేలియాలో సైతం అభిమానులను సంపాదించుకున్నాడు. బుమ్రా బౌలింగ్‌ను స్ఫూర్తిగా తీసుకున్నాడో ఆసీస్‌ చిన్నారి. అతడి స్టైల్‌లోనే బౌలింగ్‌ వేసి ఆకట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోను ఆసీస్‌కు చెందిన ఓ నెటిజన్‌ ట్విటర్‌లో పంచుకున్నాడు. ఈ ట్వీట్‌కు బుమ్రా, ప్రముఖ కామెంటేటర్‌ హర్షా భోగ్లేను కూడా జత చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ట్వీట్‌పై బుమ్రా, హర్షా ఇద్దరూ స్పందించారు. ‘ఈ కిడ్‌ చాలా క్యూట్‌గా ఉన్నాడు. అతనికి నా అభినందనలు తెలపండి’ అని బుమ్రా ట్వీట్‌ చేయగా, ‘అద్భుతం’ అంటూ హర్షా భోగ్లే ట్వీటారు. దీంతో పాటు ఐసీసీ కూడా ఫన్నీ ట్వీట్ చేసింది. ‘ 2034లో టీమిండియా-ఆసీస్‌ల మధ్య జరగబోయే సిరీస్‌ రసవత్తరంగా సాగుతుందేమో!’ అంటూ ఈ చిన్నారి వీడియోను పంచుకుంటూ ట్వీట్‌ చేసింది.

దీంతోపాటు ఈ వీడియోపై నెటిజన్లు కూడా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ఇప్పటి ఆసీస్‌ బౌలర్లు ఈ చిన్నారిని స్ఫూర్తిగా తీసుకోవాలి’ అని, ‘స్టంప్స్‌ అంత ఎత్తుకూడా లేడు. కానీ బుమ్రాను అనుకరిస్తున్నాడు’ అని, మరో కొద్ది రోజుల్లో జరగబోయే వన్డేల్లో ఈ చిన్నారిని ఆసీస్‌ తమ జట్టులో చేర్చుకోవాలి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

|

తాజా సమాచారం

Latest Posts

Featured Videos