బీరు సీసాలపై హిందూ దేవతల బొమ్మలు… అసలు నిజం ఏమిటి?

  • In Money
  • January 17, 2019
  • 802 Views

దక్షిణ భారతదేశంలోని చాలా వాట్సప్ గ్రూప్స్‌లో ఈ ప్రకటన వైరల్ అయింది. మద్యం సీసాపై హిందూ దేవతల బొమ్మలు ఉపయోగిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని అందరూ ఆరోపిస్తున్నారు.కొంతమంది ట్విటర్ యూజర్స్ ఈ ఫొటోను ట్వీట్ చేస్తూ పీఎం నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సహా చాలా మంది పెద్ద నేతలకు దీనిపై ఫిర్యాదు చేశారు. సీసాపై ఉన్న గణేష్ ఫొటో తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.చాలా మంది ఈ ప్రకటనను ఆస్ట్రేలియా మాజీ ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్‌కు కూడా ట్యాగ్ చేశారు. దానిని జారీ చేసిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరారు.వైరల్ అవుతున్నఈ ప్రకటనలో ఉన్న వివరాలను బట్టి ఆస్ట్రేలియాకు చెందిన బ్రూక్‌వెల్ అనే బీర్ కంపెనీ త్వరలో ఒక కొత్త డ్రింక్ మార్కెట్లోకి తీసుకొస్తోంది.దానిపై వినాయకుడి ఫొటో ఉంది. హాలీవుడ్ మూవీ ‘పైరేట్స్ ఆఫ్ కరిబియన్‌’లో ఒక పాత్రలా ఆ ఫొటో రూపురేఖలను మార్చారు.సోషల్ మీడియాలో చాలా మంది ఈ ప్రకటన నిజం కాదని భావిస్తున్నారు. ఎవరో ఈ ప్రకటనను ఫొటోషాప్ ద్వారా అలా మార్చి ఉంటారని అనుకుంటున్నారు.కానీ, మా పరిశోధనలో ఈ ప్రకటన వాస్తవమేనని తేలింది. బ్రూక్‌వెల్ యూనియన్ అనే ఆస్ట్రేలియా బీరు కంపెనీ త్వరలో ఒక కొత్త డ్రింక్ తీసుకొస్తోంది. దాని బాటిల్‌పైనే ఇలా గణేష్ ఫొటోను ఉపయోగించారు.ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్(సిడ్నీ)లో ఉన్న ఈ కంపెనీ 2013లో కూడా ఇలాగే బీరు బాటిళ్లపై గణేష్, లక్ష్మీదేవి ఫొటోలను ఉపయోగించి వివాదాల్లో చిక్కుకుంది.ఆ సమయంలో ఈ కంపెనీ బాటిల్‌పై లక్ష్మీదేవి ఫొటోను వేసి, దానికి వినాయకుడి తలను పెట్టారు. సీసాపైన ఆవు, దుర్గాదేవి వాహనమైన పులిని కూడా ముద్రించారు.2013లో ఈ వివాదిత ప్రకటనపై ఒక అంతర్జాతీయ హిందూ సంస్థ అభ్యతరం వ్యక్తం చేసినట్టు ‘ద టెలిగ్రాఫ్’ కథనం ప్రచురించింది. “డబ్బు సంపాదన కోసం హిందూ మత విశ్వాసాలతో పరాచికాలు ఆడడం దిగజారుడు తనమని, అలాంటి చర్యలను చూస్తూ ఊరుకోం” అని సంస్థ అన్నట్లు తెలిపింది.బ్రూక్‌వెల్ యూనియన్‌కు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హిందూ సంస్థ హెచ్చరించిందని ఈ రిపోర్టులో తెలిపారు.సమాచార ఏజెన్సీ పీటీఐ “కంపెనీ లక్ష్మీదేవి ఫొటోను ఉపయోగించడాన్ని ఆస్ట్రేలియాలో ఉంటున్న భారతీయులు కూడా వ్యతిరేకించారు.వివాదం పెద్దదవడంతో బీర్ కంపెనీ తమ దేశంలోని భారతీయులను క్షమాపణలు కోరుతూ ఒక ప్రకటన జారీ చేసింది” అని తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos