బాక్స్ ఆఫీస్ దుమ్ము దులుపుతున్న యూరి

  • In Film
  • January 29, 2019
  • 126 Views
బాక్స్ ఆఫీస్ దుమ్ము దులుపుతున్న యూరి

విక్కీ కౌశల్-యామి గౌతమ్ లు జంటగా నటించిన బాలీవుడ్ సినిమా ‘యూరి: ది సర్జికల్ స్ట్రైక్’ జనవరి 11 న విడుదలయింది.  పాకిస్తాన్ భూభాగంలోని టెర్రరిస్ట్ స్థావరాలపై ఇండియన్ ఆర్మీ 2016 లో జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ ఎపిసోడ్ ను ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా ప్రేక్షకులను మెప్పించింది.  మొదటి నుంచి రోజునుండే పాజిటివ్ మౌత్ టాక్..  విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈ చిత్రం మూడో వారంలో కూడా మంచి వసూళ్లు సాధిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా 17 రోజులకు గానూ ఇండియాలో రూ.157.38 కోట్లు కలెక్ట్ చేసింది.  మొదటి వారం లో రూ. 71.26 కోట్లు.. రెండో వారంలో రూ.62.77 కోట్లు.. మూడో వారంలో రూ. 23.35 కోట్లు వసూలు చేసిందని ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ వెల్లడించారు.  మూడో వారంలో కలెక్షన్స్ ట్రెండ్ చూస్తుంటే రూ.200 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.  రూ. 45 కోట్ల మీడియం బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 2019 సంవత్సరానికి మొదటి బ్లాక్ బస్టర్ అని తరుణ్ ఆదర్శ్ వెల్లడించారు.’మణికర్ణిక’.. ‘థాకరే’ లాంటి సినిమాలు రిపబ్లిక్ డే వీకెండ్ లో విడుదలై పోటీగా నిలిచినప్పటికీ  ‘యూరి’ మంచి కలెక్షన్స్ నమోదు చేస్తుందంటే ఈ సినిమా విజయం ఎలాంటిదో మనం అర్థం చెసుకోవచ్చు.  ముఖ్యంగా ఆదివారం నాడు దాదాపు 9 కోట్ల రూపాయలు వసూలు చేసింది.  నూతన దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ఈ చిత్రంలో పరేష్ రావల్.. మోహిత్ రైనా కీర్తి కుల్హారిలు ఇతర కీలక పాత్రలలో నటించారు. 

తాజా సమాచారం