బషీర్‌బాగ్‌లో ఎగసిపడుతున్న మంటలు

హైదరాబాద్‌: నగరంలోని ఎల్బీ స్టేడియం సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఖాన్‌ లతీఫ్‌ఖాన్‌ బిల్డింగ్‌ ఐదో అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు.  బిల్డింగ్‌లోని ట్యాక్స్ కన్సల్టెంట్‌ ఆఫీసులో జరిగిన షార్ట్‌ సర్క్యూట్‌తోనే ప్రమాదం సంభవించిందని పోలీసులు చెబుతున్నారు. ఈ భవనంలో పలు కీలక కార్యాలయాలు ఉన్నాయి. వందలాది మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మంటలు ఎగసి పడుతుండటంతో.. భవనంలో ఉన్న వారు కిందకు పరుగులు తీస్తున్నారు. రెండో అంతస్తులో రెండు తెలుగు రాష్ట్రాల ఐడియా ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం నాలుగు ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.  

తాజా సమాచారం

Latest Posts

Featured Videos