బన్నీ సరే మరి నితిన్ సంగతేంటి

  • In Film
  • February 8, 2019
  • 160 Views
బన్నీ సరే మరి నితిన్ సంగతేంటి

సినిమా పరిశ్రమలో లక్ ఎప్పుడు ఎవరిని ఏ టైంలో ఎలా వరిస్తుందో ముందే ఊహించడం కష్టం. అదృష్టలక్ష్మి చెప్పి తలుపు తట్టదు. ఒకోసారి ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తే మరోసారి అంతా తలకిందులు చేస్తుంది. ఇప్పుడు రష్మిక మందన్నను గుడ్ టైం మొదటి క్యాటగిరీలో వేసేలా ఉంది. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ షూటింగ్ లో ఉన్న రష్మిక దీంతో పాటు గతంలోనే నితిన్ కోసం భీష్మకు సైన్ చేసింది. తనకు తెలుగులో మొదటి సినిమాతోనే బ్రేక్ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకుడు కాబట్టి ఎక్కువ ఆలోచించలేదు. ఇది నిర్మిస్తున్నది హారికా హాసిని సంస్థ. అయితే బయటికి చెప్పని కారణాల వల్ల షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ఈలోగా ఇదే సంస్థ గీత ఆర్ట్స్ తో కలిసి నిర్మిస్తున్న అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబో మూవీ స్టార్ట్ చేసే టైం దగ్గరికి వచ్చింది. దీంతో నితిన్ సినిమా కోసం రష్మిక ఇచ్చిన డేట్స్ ని బన్నీ కోసం వాడుకునేలా నిర్మాత చినబాబు స్కెచ్ వేసారట. సో బూరెల బుట్టలో పడ్డట్టు నితిన్ తో లేట్ అయినా ఇప్పుడు ఏకంగా స్టైలిష్ స్టార్ తో ఛాన్స్ వచ్చి పడింది. అయితే తాను సోలో హీరోయిన్ కాదట. మరో ఇద్దరు ఉంటారని టాక్. మెయిన్ లీడ్ మాత్రం రష్మికనే ఉండొచ్చని తెలిసింది.మరి ఒకవేళ భీష్మ లైన్ లో పెట్టాల్సి వస్తే అప్పుడు రష్మిక డేట్స్ కి ఇబ్బంది అవుతుంది కదా అంటే ప్రస్తుతానికి సమాధానం లేదు. కారణం రష్మిక కేవలం తెలుగు సినిమాలు మాత్రమే చేయడం లేదు. ఇక్కడికి సమానంగా మాతృ బాష కన్నడలో స్టార్ల సరసన అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. సో నితిన్ సినిమాకు వేరే ప్రత్యాన్మాయం వెతుకుతారో లేక రష్మికనే సర్దుకుని దానికి అదనంగా కాల్ షీట్స్ ఇస్తుందో వేచి చూడాలి. బన్నీ సినిమా ప్రేమికుల రోజున ప్రారంభిస్తారని టాక్ ఉంది కానీ ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos