బన్నీ డాడీ ఎవరొస్తారో

  • In Film
  • January 29, 2019
  • 142 Views
బన్నీ డాడీ ఎవరొస్తారో

నా పేరు సూర్య దెబ్బకు ఏకంగా ఎనిమిది నెలల గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వచ్చే నెల నుంచి సెట్స్ లోకి అడుగు పెడుతున్నాడు. స్క్రిప్ట్ రెడీ అయ్యుంటే సంక్రాంతికే స్టార్ట్ అయ్యేది కాని త్రివిక్రమ్ శ్రీనివాస్ అంతకు ముందు అనుకున్న రీమేక్ కథ కాకుండా ఫ్రెష్ సబ్జెక్టు ఎంచుకోవడంతో ఫైనల్ డ్రాఫ్ట్ కు టైం పడుతోంది. ఇంకొద్ది రోజుల్లో అది పూర్తయిపోతుంది. విశ్వసనీయ సమాచారం మేరకు మాటల మాంత్రికుడు ఇందులో చక్కని ఫాదర్ సెంటిమెంట్ జోడించాడట. తాను దర్శకత్వం వహించిన అన్ని సినిమాల్లోనూ ఎక్కువగా ఫాదర్ ఎమోషన్స్ చూపించింది బన్నీ సినిమాల్లోనే. జులాయిలో తనికెళ్ళ భరణి ట్రాక్ హృద్యంగా అనిపిస్తే సన్ అఫ్ సత్యమూర్తిలో ప్రకాష్ రాజ్ సినిమా మొత్తం లేకపోయినా టైటిల్ మొదలుకుని క్లైమాక్స్ దాకా ఆ పాత్ర అంతర్లీనంగా ప్రయాణం చేస్తూనే ఉంటుంది. రెండూ సూపర్ హిట్ అయిన సినిమాలే. అందుకే ముచ్చటగా మూడో సారి కూడా ఆ మేజిక్ ని రిపీట్ చేయాలనీ డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే బన్నీకి ఈసారి తండ్రిగా ఎవరు నటిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. నరేష్-రాజేంద్ర ప్రసాద్-శరత్ కుమార్-ప్రకాష్ రాజ్ ఇలా చెప్పుకోదగ్గ ఆప్షన్లు చాలా ఉన్నాయి కాని ఫ్రెష్ గా అనిపించేలా రిపీట్ కాని ఆర్టిస్ట్ వైపు త్రివిక్రమ్ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.ఓ కన్నడ సీనియర్ హీరో కం క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని ట్రై చేస్తున్నట్టుగా సమాచారం. వచ్చే వారం లోపు దీని మీద క్లారిటీ రావొచ్చు. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఈ కాంబినేషన్ మీద అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. అరవింద సమేత వీర రాఘవ విజయంతో అజ్ఞాతవాసి జ్ఞాపకాలు చెరిపేసుకున్న త్రివిక్రమ్ కు సాలిడ్ బ్లాక్ బస్టర్ దక్కాల్సిన అవసరం ఉంది. ఆ కొరత ఇది తీరుస్తుందనే భరోసాతోనే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos