ఫోటోస్టోరి: హీటెక్కించడం వీళ్ల హాబీ

  • In Film
  • January 25, 2019
  • 140 Views
ఫోటోస్టోరి: హీటెక్కించడం వీళ్ల హాబీ

చలికాలం పోయినా చలి మంటలు వేస్తున్నారు. కుంపటి లేకపోయినా అగ్గి రాజేస్తున్నారు. కుర్రాకారు గుండెల్లో ఒకటే కాక్ టైల్ మంట! తంటా!! అసలు వీళ్ల వ్యవహారమేంటో కానీ అస్సలు జిమ్ కెళ్లనిదే.. క్లబ్బు – పబ్బు – రెస్టారెంటుకు కుర్రకారును లాక్కెళ్లనిదే వీళ్లకు నిద్ర పట్టే అవకాశమే లేదట.

ఇంతకీ ఎవరీ భామలు? అంటే రెగ్యులర్ ఫిట్ నెస్ ఫ్రీక్స్ గా ముంబై పరిశ్రమలో వేడి పెంచుతున్న ఫేజ్ 3 గాళ్స్  సారా అలీఖాన్ –  మలైకా అరోరాఖాన్ – వీళ్లతో పాటే పోర్చుగీసు మూలాలున్న గోవా బ్యూటీ వాలూచ డిసౌజా కూడా జిమ్ లో జాయినైంది. ఈ భామలంతా అందాల  దేహశిరుల్ని కమ్మేసే టైట్ ఫిట్ డ్రెస్ లతో మంటలు పెడుతున్నారు. జిమ్ కి వెళుతూ వెళ్లే దారిలో కుర్రకారుకు కంటిపై కునుకు పట్టనివ్వడం లేదట. ఇక వీళ్లు కారెక్కేటప్పుడు – కార్ దిగేప్పుడు అక్కడ ప్రత్యేకించి ఫ్యాన్స్ కళ్లప్పగించి వెయిటింగ్ లో ఉంటున్నారట. ఇదివరకూ జాన్వీ సైతం ఇలానే చేసింది. జిమ్ కెళుతూ బాటమ్ లో దుస్తులు ధరించడమే మర్చిపోయిందంటూ ట్రోలింగ్స్ కూడా చేశారు. మొత్తానికి ఫేజ్ 3 ప్రపంచంలో నవతరం భామలు – సీనియర్ నాయికలు అనే తేడా లేకుండా ఎవరి స్టైల్లో వాళ్లు హీట్ పెంచేస్తున్నారు.సండే మోటివేషన్.. మండే మోటివేషన్ అంటూ రకరకాల ఫోటోల్ని ఈ భామలు సోషల్ మీడియాల్లో షేర్ చేస్తూ నిరంతరం యువతరాన్ని వేడెక్కిస్తూనే ఉన్నారు. రేపో మాపో కుర్రహీరో అర్జున్ కపూర్ ని పెళ్లాడేందుకు రెడీ అవుతున్న మలైకా అరోరాఖాన్ వీళ్లందరికీ కెప్టెన్సీ వహిస్తూ ఫిట్ నెస్ ఫ్రీక్ లుగా మార్చేస్తోందిట. ఈ బ్యాచ్ లోనే షాహిద్ కపూర్ సతీమణి  రాజ్ పుత్ గాళ్ సైతం జిమ్ములు చేస్తూ ఫిట్ నెస్ కోసం నానా తంటాలు పడుతోంది. ఈ దిల్లీ గాళ్ త్వరలోనే కథానాయికగానూ డెబ్యూ ఇవ్వనుందన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos