ప్రేమ పక్షులపై దాడి:భజరంగ్‌దళ్‌

ప్రేమ పక్షులపై  దాడి:భజరంగ్‌దళ్‌

 హైదరాబాద్‌ : వాలెంటైన్స్‌ డే జరుపుకుంటే దాడులు తప్పబోవని భజరంగ్‌దళ్‌ నేతలు హెచ్చరించారు. బుధవారం ఉదయం విశ్వ హిందూ పరిషత్‌ రాష్ట్ర కార్యాలయంలో భజరంగ్‌ దళ్‌ తెలంగాణ కన్వీనర్‌ సుభాష్‌ చందర్‌మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. .. భారత సంస్కృతిలో భాగం కాని ప్రేమికుల రోజును జరుపుకుంటే దాడులుతప్ప బోవని హెచ్చరించారు. . ఫిబ్రవరి 14 వ తేదీన వాలెంటైన్స్‌ పేరు చెబుతూ.. ప్రేమ జంటలెవరైనా బయట కనిపిస్తే, వారిని పట్టుకొని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు. ప్రేమికుల రోజు పేరిట పబ్‌ లు, మాల్స్‌, హోటల్స్‌ లో ప్రత్యేక కార్యక్రమాల్ని జరిపితే వారిపై దాడులు తప్పవని పునరుద్ఘాటించారు.. రహదారులు, పార్కులపై ప్రేమ జంటలు కనిపిస్తే వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos