ప్రభాస్తో పోటీకి సూర్య సై…

  • In Film
  • February 9, 2019
  • 139 Views
ప్రభాస్తో పోటీకి సూర్య సై…

డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సాహో విడుదల తేది ఇంతకు ముందే ఆగస్ట్ 15 అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు దానికి పోటీ లేకుండా దరిదాపుల్లోకి వెళ్ళకుండా ఇతర నిర్మాతలు తమ సినిమాల ప్లానింగ్ ను చేసుకుంటున్నారు. అయితే ఏ పోటీ లేదే అనుకుంటున్న తరుణంలో సూర్య రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నట్టు కోలీవుడ్ టాక్. రంగం సినిమాతో మనకూ బాగా దగ్గరైన దర్శకుడు కెవి ఆనంద్ తో రూపొందిస్తున్న మూవీ కాప్పన్. తెలుగు టైటిల్ ఇంకా డిసైడ్ చేయలేదు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో దేశభక్తిని మిక్స్ చేసి తీస్తున్న ఈ మూవీలో మోహన్ లాల్ తన కెరీర్ లో మొట్టమొదటి సారి భారతదేశ ప్రధాన మంత్రిగా నటిస్తున్నాడు. ఆయనను కంటికి రెప్పలా కాపాడే ఆఫీసర్ పాత్రే సూర్యది. అల్లు అర్జున్ వరుడుతో మనకు పరిచయమున్న ఆర్య ఇందులో విలన్ గా చేస్తున్నాడు. అతని లవర్ కం కాబోయే భార్య సాయేషా సైగల్ కాప్పన్ లో హీరొయిన్. ఇలా ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు ఉన్న ఈ మల్టీ స్టారర్ రిలీజ్ ని ఆగస్ట్ 15కు ప్లాన్ చేస్తున్నారట.అయితే ఇది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సూర్య చేస్తున్న మరో మూవీ ఎన్జికె(నంద గోపాల కృష్ణ)తమిళ ఉగాది రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ గా వస్తే కాప్పన్ కు రూట్ క్లియర్ గా ఉంటుంది. భారీ సినిమాల నిర్మాణానికి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న లైకా సంస్థనే కాప్పన్ ను సుమారు వంద కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇప్పుడు ఆగస్ట్ 15 అంటే సాహో తో క్లాష్ తప్పదు. ఇంచుమిందు రెండు ఒకేతరహా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో అనిపించే మూవీస్ కాబట్టి పోటీ తీవ్రంగానే ఉంటుంది. సూర్య కనక ఒకేసారి తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేయాలి. మరి సాహోతో సై అంటారో లేక వాయిదా వేస్తారో వేచి చూడాలి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos