పేలవమైన ఫీల్డింగ్…అయినా ఓ క్యాచ్ అద్భుతం

  • In Sports
  • February 6, 2019
  • 138 Views
పేలవమైన ఫీల్డింగ్…అయినా ఓ క్యాచ్ అద్భుతం

వెల్లింగ్టన్‌: మ్యాచుల ఫలితం సంగతి ఎలా ఉన్నా వాటిలో గుర్తుండిపోయే కొన్ని ఘటనలు జరుగుతుంటాయి. ఇలాంటివే వెల్లింగ్టన్‌ వేదికగా జరిగిన టీ20లో చోటు చేసుకున్నాయి. తొలి టీ20లో భాగంగా బౌలింగ్‌ ఎంచుకున్న పర్యాటక జట్టుకు ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మెన్‌ చుక్కలు చూపించారు. దొరికిన బంతిని వీలైతే ఒక ఫోర్‌..కుదిరితే సిక్స్‌ చందాన బాదేశారు. ఇందులో భాగంగా 10 ఓవర్లో కృనాల్‌ బౌలింగ్‌లో సీఫెర్ట్‌ కొట్టిన బంతి దినేశ్‌ కార్తిక్‌ చేతికి చిక్కినట్లు చిక్కి కింద పడింది. పరుగుల వరద పారిస్తున్న కొత్త కుర్రాడిని పెవిలియన్‌ చేర్చాలన్న టీమిండియా లక్ష్యం నెరవేరలేదు. అయితే స్వతహాగా ప్రతీకారం తీర్చుకునే లక్షణమున్న టీమిండియా ఆటగాళ్లకు హార్దిక్‌ పాండ్య రూపంలో మరో అవకాశం వచ్చింది. 14.6 ఓవర్లో హార్దిక్ పాండ్య వేసిన బంతిని డేరిల్‌ మిచెల్‌ భారీ షాట్‌ కొట్టాడు. అది బౌండరీ దాటినట్లు దాటి దినేశ్‌ కార్తిక్‌ చేతుల్లో పడింది. మరో ఆరు పరుగులు ఇచ్చేదిశగా సాగుతున్న బంతిని బౌండరీ దగ్గరున్న దినేశ్ కార్తిక్‌ అద్భుతంగా క్యాచ్‌ పట్టాడు. దీంత సదరు బ్యాట్స్‌మెన్‌ పెలివియన్‌ చేరాల్సి వచ్చింది. తర్వాత 17.3ఓవర్లో పాండ్య బౌలింగ్‌లో రాస్‌ టేలర్‌ కొట్టిన బంతిని కూడా దినేశ్‌ కార్తిక్ వదిలేశాడు. దీంతో న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. టీమిండియా బౌలర్లు చేతులెత్తేయడం, పిచ్‌ పచ్చికతో కళకళలాడుతుండంతో ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మెన్‌ పరుగుల వరద పారించారు. దీంతో కివీస్‌ 80 పరుగుల తేడాతో విజయం సాధించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos