పాక్‌ ‘డాన్‌’లో పవన్‌ కల్యాణ్

ఇస్లామాబాద్: భారత్‌లో లోక్‌సభ ఎన్నికలకు ముందు పాక్‌తో
యుద్ధం జరుగుతుందని బీజేపీ తనకు రెండేళ్ళ కిందటే చెప్పినట్లు సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు
 పాకిస్తాన్‌లోని ప్రముఖ పత్రిక
డాన్‌ అంతర్జాత వేదికలో ప్రతిఫలించింది. దీనికి సంబంధించి సంక్షిప్త
సమాచారాన్ని ఇచ్చి  మన దేశ ఇంగ్లీష్ పత్రిక
అంతర్జాలవేదికలోని  కథనాన్ని అనుసంధానం చేసింది. కడప జిల్లాలో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో ఈ వ్యాఖ్యల్ని చేసిన పవన్‌ కళ్యాణ్‌కు గతంలో బీజేపీతో సంబంధాలుండేవని వివరించింది. భారత్‌లోని ముస్లింలు వారి దేశభక్తిని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదంటూ సమాజంలో మత విద్వేషాలను రెచ్చ గొట్టేందుకు జరిగే ప్రయత్నాలను విఫలం చెయ్యాల్సిందిగా జనసేన కార్యకర్తలకు పవన్ పిలుపు నిచ్చినట్లు ఈ కథనం తెలిపింది. “భారతదేశంలో ముస్లింలకు సమాన హక్కులున్నాయి. పాకిస్తాన్‌లో హిందువుల స్థితి ఏమిటో నాకు తెలియదు కానీ, భారత్ మాత్రం ఎప్పుడూ ముస్లింలను అక్కున చేర్చుకుని ఆదరిస్తూనే ఉంది.అందువల్లే అజహరుద్దీన్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ అయ్యారు, అబ్దుల్ కలాం ఈ దేశ రాష్ట్రపతి అయ్యారు” అని పవన్ తన ప్రసంగంలో చెప్పినట్లు కథనం వివరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos