న్యూజిలాండ్‌ను వణికించిన భూకంపం

న్యూజిలాండ్‌ను వణికించిన భూకంపం

వెల్లింగ్టన్ (న్యూజిలాండ్): ఇవాళ ఉదయం న్యూజిలాండ్‌లో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. ఎల్ఎస్పెరెన్స్ రాక్‌కు ఆగ్నేయంలో 248 కిలోమీటర్ల దూరంలో పది కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రీకృమైనట్టు అమెరికా జియలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. భూకంపం కారణంగా జరిగిన నష్టంపై సమాచారం తెలియాల్సి ఉంది. పసిఫిక్ తీరంలోని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ జోన్‌లో ఉన్న న్యూజిలాండ్‌లో తరచూ భూకంపాలు, అగ్ని పర్వత విస్ఫోటాలు జరుగుతుంటాయి. గతేడాది అక్టోబర్‌లో 6.2 తీవ్రతతో చోటు చేసుకున్న భూ ప్రకంపనలు రాజధాని వెల్లింగ్‌టన్‌ను వణికించాయి. దీంతో పార్లమెంటును కూడా కొద్ది సేపు వాయిదా వేయాల్సి వచ్చింది. 2011లో 6.3 తీవ్రతతో చోటుచేసుకున్న భూకంపం క్రైస్ట్‌చర్చ్ నగరాన్ని అతలాకుతలం చేసింది. దీనికారణంగా 150 మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మందికి గాయాలయ్యాయి.

తాజా సమాచారం