నెగిటివ్‌ నోట్‌తో స్టాక్‌ మార్కెట్లు

  • In Money
  • February 12, 2019
  • 142 Views
నెగిటివ్‌ నోట్‌తో  స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం వరుసగా రెండోరోజు కూడా నెగిటివ్‌ నోట్‌తో ప్రారంభమైనాయి. అనంతరం నష్టాలనుంచి కోలుకోవడం గమనార్హం. మిడ్‌క్యాప్‌, నిఫ్టీ బ్యాంకు సెక్టార్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. దీంతో 40 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్‌ వెంటనే తేరుకుని 31 పాయింట్లు ఎగిసి 36,426వద్ద నిఫ్టీ కూడా 9పాయింట్లు ఎగిసి 10897వద్ద కొనసాగుతోంది. ఎల్‌ అండ్‌ టీ, హెచడీఎఫ్‌సీ, కోటక్‌, ఎస్‌బీఐ, ఎస్‌ బ్యాంకు, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా లాభపడుతుండగా, రిలయన్స్‌  క్యాపిటల్‌ , యాక్సిస్‌, ఐసీఐసీఐ బ్యాంకు నష్టపోతున్న వాటిల్లో ఉన్నాయి.  ఉదయం 9.30గంటల సమయంలో సెన్సెక్స్‌ 8పాయింట్ల నష్టంతో 36,386 వద్ద, నిఫ్టీ 4 పాయింట్లతో 10,884 వద్ద ట్రేడవుతోంది. ఐషర్‌ మోటార్స్‌ షేర్లు మూడు శాతం నష్టాలతో ట్రేడవుతున్నాయి. నిన్న ఈ కంపెనీ లాభాల్లో 2.39శాతం వృద్ధిని చూపిస్తూ ఫలితాలను ప్రకటించింది. యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం నష్టాలతో ట్రేడవుతోంది. ప్రభుత్వానికి ఎస్‌యూయూటీఐ ద్వారా యాక్సిస్‌ బ్యాంక్‌లో ఉన్న వాటాలను మార్కెట్లో విక్రయించనుందన్న వార్తలు వెలువడటంతో ఈ పరిస్థితి నెలకొంది. నేడు కొన్ని ప్రధాన కంపెనీలు ఫలితాలను విడుదల చేయనున్నాయి. వీటిల్లో కోల్‌ ఇండియా, హిందాల్కో ఇండస్ట్రీస్‌, సన్‌ ఫార్మస్యూటికల్స్‌ వంటి దిగ్గజాలు ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos