నిధి అగర్వాల్ ఇక ప్యాక్ చేసుకోవడం బెటర్

  • In Film
  • January 29, 2019
  • 147 Views
నిధి అగర్వాల్ ఇక ప్యాక్ చేసుకోవడం బెటర్

సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నిధి అగర్వాల్. ఫస్ట్ సినిమానే నాగచైతన్య లాంటి యంగ్ హీరోతో చేస్తే.. ఆ తర్వాత అవకాశాలు ఫుల్లుగా వస్తాయి. బ్యాడ్ లక్ సవ్యసాచి ఫెయిల్ అయ్యింది. ఆ తర్వాత అదృష్టం వరించింది. చైతూ తమ్ముడు అఖిల్.. తన మిస్టర్ మజ్నులో అవకాశం ఇచ్చాడు. ఇది కూడా ఇప్పుడు నిధి అగర్వాల్ కు పెద్దగా ఉపయోగ పడేట్లు కన్పించడం లేదు. మిస్టర్ మజ్ను సినిమా చూసిన వాళ్లంతా చెప్తున్నది ఒకటే.. సినిమాలో నిధి తప్ప మిగిలిన అమ్మాయిలంతా చాలా అందంగా ఉన్నారని. యాక్చువల్ గా చెప్పాలంటే మొదటి సినిమాలోనే నిధి తేలిపోయింది. కానీ రెండో సినిమాలో అయినా బెటర్ గా కన్పిస్తుందేమోనని ఆశ. కానీ మిస్టర్ మజ్నులో అతి తక్కువ మార్కులు ఎవరికైనా పడ్డాయి అంటే అది నిధి అగర్వాల్ కే.సాధారణంగా బెంగళూరు అమ్మాయి బావుంటారు. ఒక్క చూపుతోనే ఆకట్టుకుంటారు. కానీ నిధి పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది. రెండు సినిమాలు రిలీజ్ అయినా కూడా నిధి.. మన ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు. దీంతో.. ఇప్పుడు నిధి ఆశలన్నీ ఇస్మార్ట్ శంకర్ పైనే ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే.. పాతుకుపోవాలని ప్లాన్ చేస్తోంది. కానీ అటు పూరీకి ఇటు రామ్ కి ఇద్దరికి అంతగా హిట్స్ లేవు. ఇలాంటి టైమ్ లో ఇస్మార్ట్ శంకర్.. నిధి అగర్వాల్ కెరీర్ కు ఏమాత్రం హెల్ప్ అవుతుందో చూడాలి.

తాజా సమాచారం