దేశ విభజనకు పాక్‌ కుట్ర

దేశ విభజనకు పాక్‌   కుట్ర

న్యూఢిల్లీ: ‘పాకిస్థాన్‌ మనల్ని విభజించాలని చూస్తోంది. భారతీయులంతా
జవాన్లలా అప్రమత్తంగా ఉండాలి. భారత్‌
ఉమ్మడి గానే పోరాడుతుంది. ఒక్కటిగానే మనుగడ సాగించి విజయాన్ని సాధిస్తుంది’ అని
ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోటి
మంది భాజపా పోలింగ్‌ కేంద్రం స్థాయి కార్యకర్తలతో మాట్లాడారు. ‘అన్ని రంగాల్లో మనం
తీవ్రంగా కటోరంగా శ్రమించాల్సిన అవసరముంది. దేశాన్ని  కాపాడుతున్న వారికి
పట్ల మనం కృతజ్ఞత చూపించాలి. వాళ్లు ఉన్నందువల్లే దేశం అభివృద్ధిలో కొత్త శిఖరాలను
అందుకోగలుగుతోంది’ అన్నారు. భద్రతా దళాల నైతిక విలువలు దెబ్బ తీసేవిధంగా ఎలాంటి
చర్యలను మనం చేపట్టరాదని విన్నవించారు. ‘శత్రువు మనల్ని అస్థిర పరచాలని
చూస్తున్నాడు. ఉగ్రవాద దాడులు జరిపాడు. మన అభివృద్ధిని అడ్డుకోవడమే వారి లక్ష్యం.
వారి దుష్ట కుట్రలను ఎదుర్కొనేందుకు నేడు దేశపౌరులందరూ ఒక్కటిగా నిలబడ్డారు’ అని పేర్కొన్నారు.
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, పాక్‌ చేతిలో భారత పైలట్‌గా బంధీగా ఉన్నబాధాకరమైన దశలో
మోది వీడియో కాన్ఫరెన్సును నిర్వహించటాన్ని  విపక్షాలు ఖండించాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos