దావోస్‌లో లోకేష్ బృందం సత్ఫలితాలు సాధిస్తోంది

దావోస్‌ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ బృందం సత్ఫలితాలు సాధిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం ఉదయం సీఎం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. 13 జిల్లాల్లో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని చెప్పారు. రైతులకు రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. కౌలు రైతులకు రూ.5వేల కోట్ల పంటరుణాలు ఇచ్చామని, అలాగే ఇన్‌పుట్ సబ్సిడీ రూ.4 వేల కోట్లు ఇచ్చామని చెప్పారు. నాలుగేళ్లలో 97 శాతం రైతుల ఆదాయం రెట్టింపు చేశామన్నారు. విపత్తు సహాయం 50% నుంచి 75శాతానికి పెంచామని చంద్రబాబు పేర్కొన్నారు. మంత్రిమండలి నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు ఆయన సూచించారు. పేదల సంక్షేమానికి తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించాలన్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos