తెలుపు కార్ల మీదే భారతీయులకు మోజు

దిల్లీ: భారతీయులు తమ కార్లు తెలుపు రంగులో ఉండాలనే కోరుకుంటున్నారట. 2018లో 43 శాతం మంది ఆ రంగునే ఎంచుకున్నారట. జర్మనీకి చెందిన రసాయన సంస్థ బీఏఎస్‌ఎఫ్ తన అధ్యయనంలో ఈ విషయాలను వెల్లడించింది. ఆ కంపెనీ ‘బీఏఎస్‌ఎఫ్ కలర్‌ రిపోర్ట్ ఫర్ ఆటోమోటివ్ ఓఈఎం కోటింగ్స్’ పేరుతో ఓ నివేదికను వెలువరించింది. తెలుపు తరువాత గ్రే(15శాతం), సిల్వర్(15శాతం) రంగులను ఎంపిక చేసుకున్నారని వెల్లడించింది. తరవాత స్థానాల్లో ఎరుపు(9శాతం), నీలం(7శాతం), నలుపు(3శాతం) రంగులను ఎంపిక చేసుకున్నారు. ‘భారతీయ కొనుగోలు దారులు ముత్యపు రంగు(పర్ల్ వైట్‌)నే ఎంచుకుంటున్నారు. ఇక్కడి వాతారణం వేడిగా ఉండటం కూడా ఈ రంగును ఎంచుకోడానికి కారణం. తెలుపు రంగు వల్ల కార్లు త్వరగా వేడెక్కవు. అలాగే ఆ రంగు విలాసవంతంగా కనిపించడం కూడా ఓ కారణం కావొచ్చు’ అని బీఏఎస్‌ఎఫ్‌ హెడ్ ఆఫ్ డిజైన్స్ చిహారు మత్సుహారా వెల్లడించారు. స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్(ఎస్‌యూవీ) కార్ల విషయంలో కూడా 41 మంది ఈ రంగు వైపే మొగ్గు చూపుతున్నారు. అలాగే కాంపాక్ట్ సెగ్మెంట్‌, కాంపాక్ట్ ప్రీమియమ్ సెగ్మెంట్ల విషయంలో కూడా తెలుపుదే పైచేయి. అయితే మిడ్ సైజ్డ్‌ సెగ్మెంట్ లో మాత్రం నలుపు రంగు రెండో స్థానాన్ని ఆక్రమించిందని వెల్లడించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos