తెలంగాణలో అంతరిస్తున్న చిరుతలు

  • In Crime
  • January 16, 2019
  • 790 Views
తెలంగాణలో అంతరిస్తున్న చిరుతలు

నిజామాబాద్ జిల్లాలో ఓ చిరుత మృతి కలకలం రేపుతోంది. మక్లూర్ మండలం మామిడిపల్లి శివారులోని అటవీప్రాంతంలో చిరుత మృత దేహాన్ని గుర్తించిన స్థానిక పోలీసులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన అటవీశాఖ బృందం చిరుత మృతిపై విచారణ చేపట్టింది. వేటగాళ్ళు పులి చర్మం కోసం చంపి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చాకే అసలు విషయాలు బయట పడతాయని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు.

కొద్దిరోజుల క్రితం ఇదే అటవీ ప్రాంతంలో విద్యుత్‌ తీగలకు తగిలి ఓ చిరుత తీవ్రంగా గాయపడింది. అనంతరం కోలుకుని మళ్లీ అడవిలోకి పోయింది. అయితే ఇదే పులిని చర్మం కోసం వేటగాళ్లు చంపి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వస్తే కానీ.. గాయపడ్డ చిరుతా లేక మరో చిరుతను వేటగాళ్లు పొట్టునపెట్టుకున్నారా అన్నది తెలుస్తుందని అంటున్నారు.

చిరుత మృతదేహం దొరికిన తర్వాత అధికారులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. తులసి, రవి, విజయ్‌, నరేందర్‌ అనే వ్యక్తులను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. వీరి నుంచి వేటకు ఉపయోగించే ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos