తారక్ కోసం హాలీవుడ్ హీరోయిన్…

  • In Film
  • February 9, 2019
  • 114 Views
తారక్ కోసం హాలీవుడ్ హీరోయిన్…

బాహుబలి విజయంతో ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి అత్యంత భారీ వ్యయంతో భారీమాస్‌ ఫ్యాన్‌బేస్‌ ఉన్న చరణ్‌,తారక్‌లతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌పై వస్తున్న ఊహాగానాలు బహుశా మరే చిత్రంపై వచ్చి ఉండవేమో.ప్రాజెక్ట్‌ మొదలైనప్పటి నుంచి ఈ చిత్రంపై స్థానిక మీడియాతో పాటు జాతీయస్థాయి మీడియా కూడా ఒక కన్నేసి ఉంచి తరచూ ఏదోఒక కథనాలు ప్రసారం చేస్తుండడంతో ఆర్‌ఆర్‌ఆర్‌పై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. కానీ ఒక్కటీ నిజంకాని గ్యాసిప్ లే. బిఫోర్ ఇండిపెండెన్స్, 2020 రెండు కాలాలు సినిమాలో వుంటాయని, హీరోయిన్లు ఫిక్స్ అయిపోయారని మరోటి, ఒకరు దొంగ ఇంకొకరు పోలీస్ ఇలా చాలా వున్నాయి.తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌పై మరోక ఊహాగానం ఆసక్తిని కలిగిస్తోంది.చిత్రంలో రామ్‌చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ యువహీరోయిన్‌ అలియాభట్‌ నటించడం దాదాపుగా ఖరారైనట్లేనని వార్తలు వినిపిస్తుండగా తారక్‌కు జోడీగా హాలీవుడ్‌ హీరోయిన్‌ కోసం చిత్రయూనిట్‌ వెదుకులాట ప్రారంభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.సినిమాలో కథానుసారం తారక్‌కు జోడీగా నటించనున్న అమ్మాయి విదేశీ వనితగా కనిపించాల్సి ఉండడంతో ఈ పాత్ర కోసం హాలీవుడ్‌ హీరోయిన్‌ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఊహాగానాలు వెలువుడుతున్నాయి. ఆలియా భట్ వ్యవహారం ఈవారంలో ఫైనల్ కావచ్చు. ఫారిన్ అమ్మాయిగా ఎవరు అన్నది ఇంకా తేలలేదు. వెదుకులాట సాగుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos