తప్పిన పెను ప్రమాదం..

తప్పిన పెను ప్రమాదం..

పెను ప్రమాదం తప్పింది.! ప్రమాదకరమైన సీసీఎం-137 ఐసోటోప్ కంటైనర్‌ దొరికింది. ‌దీంతో ఓఎన్జీసీ అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదకరమైన ఈ ఐసోటోప్‌ ఒక వేళ నిజంగా మిస్ యూజ్ అయి ఉంటే? తెలియని వారు ఏదో పనికిరాని వస్తువని ఆపరేట్ చేసి ఉంటే? తలెత్తే పరిస్థితి ఊహించగలమా? దేశంలోనే అతిపెద్ద కంపెనీ ఓఎన్జీసీలో నిలువెత్తు నిర్లక్ష్యానికి నిదర్శనం ఈ ఘటన.
రాజమండ్రి ఓన్డీసీ నుంచి మిస్‌ అయిన రేడియో యాక్టివ్‌ మెటీరియల్‌ సీసీఎమ్‌-137 ఆచూకీ లభ్యమయ్యింది. కృష్ణా జిల్లా కలిదిండి వద్ద ఈ ఐసోటోప్‌ను రాజమండ్రి అర్బన్‌ పోలీసులు కనుగొన్నారు. టీవీ5 కథనాలతో ఐసోటోప్‌ పరికరం గురించి తెలుసుకుని.. పాత ఇనుప సామాను దుకాణం యజమాని పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో.. పాత ఇనుప సామానుల వద్ద ఐసోటోప్‌ను అమ్ముతుండగా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.ఇంటిదొంగల పనేనే అనే కోణంలో విచారిస్తున్న ప్రత్యేక పోలీస్ బృందం.. నిపుణుల సూచనలతో సీసీఎమ్‌-137ను రాజమండ్రి తరలించారు……

ఈ నెల 16న మిస్సైన ఈ ఐసోటోప్‌ చాలా ప్రమాదకరమైంది. పొరపాటున ఈ స్టీల్‌ డబ్బా మూత తీసి ఉంటే భారీ విపత్తు సంభవించేది. గాలిలో కలిసిపోయి మానవ శరీరంలోకి తెలియకుండా సోకేది. నరాల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించేది. వందరోజులలోపే మనిషిని చంపేస్తుందీ ఐసోటోప్‌. అందుకే ఇది మిస్సైన వెంటనే ఓఎన్జీసీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు… జరగరాని ప్రమాదం జరిగితే….. ఎలాంటి చర్యలు తీసుకోవావాలో తెలిసిన నేషనల్ డిజస్టర్ టీమ్ ను రప్పించింది.ఇదీ మిస్సైన విషయాన్ని చాలా గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు ఓఎన్జీసీ అధికారులు. తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే…ఈ ఐసోటోప్‌ పోయిన విషయం తెలుకున్న టీవీ5….. మొదటి నుంచి ప్రజలను అప్రమత్తం చేసింది. చివరికి ఇది దొరకడంతో ఊపిరి పీల్చుకున్నారు ఓఎన్జీసీ అధికారులు.సీఎస్‌ 137… సైగ్స్ ఆఫ్ సీసియం! అత్యంత ప్రమాదకరమైన రేడియో యాక్టివ్ మెటీరియల్ యురేనియం కాంబినేషన్ లోని ఒక మూలకం ఇది. బీటా , గామా కిరణాలకోసం వాడే సీఎస్‌ 137ను ఓఎన్జీసీ సంస్థ నిక్షేపాలు వెలికితేసే సమయంలో వాడతారు. దీని ధర 27 లక్షలే అని ఎలాంటి ప్రమాదం లేదని రెండు మీటర్ల మేర మాత్రమే సీఎస్‌ 137 ప్రభావం చూపిస్తుందని చెప్పుకుంటూ వచ్చారు. కానీ నేషనల్ డిజాస్టర్ టీమ్ ను దించడంతో అసలు విషయం బయటికి వచ్చింది.ప్రమాదకరమైన సీఎస్‌ 137 ఐసోటోప్‌ మిస్సవడంతో తూర్పుగోదావరి , కృష్ణా, జిల్లాల్లో గందరగోళం ఏర్పడింది. ఇది చిక్కరానివారి చేతికి చిక్కితే … జరగరాని ప్రమాదం సంభవించేది. ఫిర్యాదు అందగానే పోలీసులు హుటాహుటిన రంగంలో దిగారు. దీనికి కోసం గాలించారు. మరోవైపు ఎన్డీఆర్‌ఎఫ్ టీం సైతం… పోలీసుల వెంటే తిరిగింది. చివరికి కృష్ణా జిల్లా కలిదిండి లో ఇనుపదుకాణంలో ఇది లభించింది…కృష్ణాజిల్లా మల్లీశ్వరం నుంచి రాజమహేంద్రవరం బేస్ క్యాంపు కు అత్యంత భద్రత మధ్య ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చిన సీఎస్‌ 137 ఐసోటోప్‌ కంటైనర్….. ఇనుప దుకాణంలోకి ఎలా వెళ్లిందన్నది ఇప్పుడు ప్రశ్నార్ధంగా మారింది. పనికిరాని వస్తువని దీన్ని పగలకొట్టి ఉంటే పరిస్థితి ఏంటీ? ఊహిస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. ఓఎన్జీసీ అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతటి నిర్లక్ష్యానికి కారణమెవరో కనిపెట్టి వారిని కఠినంగా శిక్షించాలంటున్నారు జనం. మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos