ట్రైలర్ కోసం అష్టకష్టాలు

  • In Film
  • January 29, 2019
  • 118 Views
ట్రైలర్ కోసం అష్టకష్టాలు

గత కొన్నేళ్ళలో సినిమా టాక్ బాగుండి వసూళ్ళ పరంగా దారుణమైన డిజాస్టర్ గా మిగిలిన సినిమా ఎన్టీఆర్ కథానాయకుడే . మరీ నెగటివ్ గా జనాలు అభిప్రాయం వ్యక్తం చేయనప్పటికీ థియేటర్లలో మాత్రం వాళ్ళు కనిపించలేదు. ఫలితంగా 70 కోట్లకు అమ్మిన సినిమా 20 కోట్లు తేవడానికి నానా తంటాలు పడింది. ఇప్పుడు మహానాయకుడు రాబోతోంది. నిజానికి రెండు భాగాలకు కలిపి ఒకే ట్రైలర్ ను గతంలో ప్రీ రిలీజ్ లో విడుదల చేసారు. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఫలితం నేపధ్యంలో దాన్ని రిపీట్ చేయడం కుదరదు. మార్చాల్సిందే. అందుకే క్రిష్ టీం కొత్త ట్రైలర్ ను కట్ చేయడం కోసం ఫ్రెష్ గా ఎడిటింగ్ మొదలుపెట్టినట్టు సమాచారం. మొదటి భాగంలోని బిట్స్ ని వాడకుండా ఇది పూర్తిగా వేరే సినిమా అనే ఫీలింగ్ కలిగించేలా ఎమోషన్స్ ని బాగా హై లైట్ చేసేలా దగ్గరుండి మరీ చేయించుకున్నట్టు తెలిసింది. ఇప్పటికీ విడుదల విషయంలో క్లారిటీ మిస్ అవుతోంది. ముందు ప్రకటించిన డేట్ పక్కన పెట్టారు. పోనీ కొత్త తేదీ చెబుతున్నారా అంటే అదీ లేదు. ఇంత లో బజ్ లో మహానాయకుడు ఓపెనింగ్స్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. పైగా కథానాయకుడు ఫలితం ఇంకా కళ్ళ ముందు కదులుతూ ఉండగానే ప్రేక్షకులు దీని వైపు సులభంగా మొగ్గు చూపరు.అది పోతే పోయింది ఇందులో ఏదో విషయం ఉందనే అభిప్రాయం బలంగా కలగాలి. దానికి మొదటి అడుగే ట్రైలర్. అందుకే కొన్ని కీలక సన్నివేశాలు తీసుకుని  ట్రైలర్ ని చాలా జాగ్రత్తగా కట్ చేసినట్టు సమాచారం. విడుదల తేదీ ఏదైనా ట్రైలర్ అయితే ముందు జనంలోకి వదలాల్సిందే. పబ్లిసిటీ కూడా కాస్త వేగవంతం చేయాలి. యూనిట్ నిరాశ నుంచి బయటికి వచ్చి మహానాయకుడికి ఊపొచ్చే ప్రమోషన్ చేయాలి. సో ఈ తక్షణ కర్తవ్యాన్ని క్రిష్ బాలయ్యలు ఎంత సమర్దవంతంగా నిర్వహిస్తారు అనే దాని మీద ఓపెనింగ్స్ ఆధారపడి ఉంటాయి.

తాజా సమాచారం